Alia Bhatt- Mahesh Babu: ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తున్న రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నాడు.రాజమౌళి తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో ఉంటుందని చాలా కాలం క్రితమే కన్ఫర్మ్ చేశాడు. ఈ మూవీ జోనర్ పై ఓ హింట్ కూడా ఇచ్చేశాడు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్నాళ్లుగా మహేష్ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. మహేష్ తో రాజమౌళి చేసే మూవీ జోనర్ పై అనేక ఊహాగానాలు ఉన్నాయి. గతంలో మహేష్ ని అడిగితే కొన్ని లైన్స్ అనుకున్నాం. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదన్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు.

ఇది ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ సాహసికుడు కథ. అడ్వెంచర్ అండ్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతుంది అన్నారు. రాజమౌళి గత చిత్రాలకు మించి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ ఇండియన్ జేమ్స్ బాండ్ లా కనిపించే ఆస్కారం కలదు. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి విదేశీ సాంకేతిక నిపుణులను తీసుకోనున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రముఖ విఎఫ్ఎక్స్ సంస్థను సందర్శించారు. అది మహేష్ సినిమా కోసమే అని అందరూ భావిస్తున్నారు.
కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెట్స్ కి వెళ్లనుందట. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేశారట. అలాగే మహేష్ కి జంటగా నటించే హీరోయిన్ కూడా ఫిక్స్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యులు ఉమర్ సంధు మహేష్-రాజమౌళి మూవీలో హీరోయిన్ గా అలియా నటిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. రాజమౌళి లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ లో అలియా హీరోయిన్ గా నటించగా ఆయన మరోసారి రిపీట్ చేస్తున్నారట.

అయితే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ నుండి అలియా తప్పుకుంది. మొదట్లో ఈ సినిమాకు సైన్ చేసిన అలియా తర్వాత చేయడం కుదరదని వైదొలిగారు. ఎన్టీఆర్ ని పక్కన పెట్టిన అలియా భట్ మహేష్ కి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలియా ప్రస్తుతం గర్భవతి. త్వరలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నారు. డెలివరీ అనంతరం అలియా రాజమౌళి ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారట.