అలియా భట్ బాలీవుడ్ క్యూట్ బ్యూటీ, అండ్ అల్సొ స్టార్ బ్యూటీ కూడా. అయినా, నటన కోసం సామాన్యురాలు అయిపోతుంది. సహజమైన నటన కోసం పాత్రలో లీనమై పోతుంది. ఎంతైనా అలియాకు ఎప్పటికప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించడం అనేది బాగా అలవాటు అయిపోయింది. నిజానికి కెరీర్ స్టార్టింగ్ నుంచే అలియా పాత్రల ఎంపిక చాల ప్రత్యేకంగా కొనసాగుతుంది.
కథల పై సరైన అవగాహన లేని సమయంలో కూడా తాను చేయబోయే పాత్రల విషయంలో ఎంతో కేర్ తీసుకోవడం నేర్చుకుంది. సినిమా వాతావరణంలో పుట్టి పెరగడం ఆమెకు బాగా ప్లస్ అయింది. అందుకే ఏ పాత్ర చేస్తే.. ఆ పాత్ర తాలూకు ఆర్క్ ను బాగా పట్టుకో గలుగుతుంది. ఇక అలియా ‘ఆర్ఆర్ఆర్’లో సీత పాత్రలో నటించింది.
పైగా ఆమె పాత్ర చాలా కీలకం. సంప్రదాయబద్ధంగా చీరకట్టులో కనిపించబోతున్న అలియా .. తన పాత్ర కోసం హెయిర్ స్టయిల్ నుంచి లుక్స్ వరకు అన్నీ కొత్తగా, ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. తాజాగా ఈ సినిమా ఎడిటర్ తమ్మిరాజు అలియా ట్రాక్ ఫుటేజ్ ను ఎడిట్ చేశారు. అలియా ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా వచ్చాయట.
ఆమె నటన ముందు రామరాజుగా రామ్ చరణ్ కృషి పూర్తిగా తేలిపోయాడట. అంత గొప్పగా సీత పాత్రలో అలియాభట్ నటించిందని.. ఆత్మస్థైర్యం మెండుగా ఉన్న వనితగా సీత పాత్రను రాజమౌళి అద్భుతంగా డిజైన్ చేశాడని.. అది కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అవ్వనుందని తెలుస్తోంది. దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు.