Alia Bhat: బాలీవుడ్ మోస్ట్ బ్యూటీపుల్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరు త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారని బీ టౌన్ లో టాక్ నడుస్తుంది. వీరిద్దరూ కలిసి జంటగా నటించిన “బ్రహ్మాస్త్ర” సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది.

కాగా వీరు నటిస్తున్న మిగతా ప్రాజెక్ట్స్‌ను కూడా పూర్తి చేసే పనిలో బిజీగా రణ్‌బీర్, ఆలియా ఉన్నట్లు సమాచారం. ప్రతుత్తం ఈ జంట ఏ సినిమాలకు ఒకే చెప్పకుండా… తమ డేట్ లను ఖాళీగా ఉంచుతున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో త్వరలోనే వీరి పెళ్లి కన్ఫర్మ్ అని వార్తలు వస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు గానే ఈ డిసెంబర్‌లో అలియా-రణ్‌బీర్‌లు పెళ్లి ఖాయమని… రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ జంట పెళ్లి తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

గతంలో నటి లారా దత్త సైతం వీరి పెళ్లిపై స్పందిస్తూ 2021 డిసెంబర్‌లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుందని… 2020లోనే జరగాల్సిన వీరి పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆలియా భట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా వచె ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కానుంది.