Alekhya Chitti Pickles : ఈమధ్య కాలం లో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles) పేరు సోషల్ మీడియా లో ఎలా వినిపిస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. కస్టమర్స్ తో అమర్యాదగా మాట్లాడినందుకు ఆమెపై సోషల్ మీడియా లో విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది. కనిపిస్తే కొట్టేస్తారేమో అనే రేంజ్ వాతావరణం ఏర్పడింది. అలేఖ్య చిట్టి పికిల్స్ పై మీమ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి, సినిమా వాళ్ళు కూడా దీనిపై సెటైర్లు వేస్తూ కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు బుల్లితెర పై ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా దీనిపై ప్రత్యేకంగా స్కిట్స్ కూడా చేశారు. ఇంత నెగటివిటీ ని ఎదురుకున్న తర్వాత కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కా చెల్లెల్లు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోని అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం.
ఆమె మాట్లాడుతూ ‘ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వమని దేవుడిని మొక్కని రోజంటూ లేదు,మన అలేఖ్య చిట్టి పికిల్స్ కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఎందుకు బ్యాన్ అవుతుందో అసలు అర్థం కావడం లేదు. సరే బ్యాన్ అయ్యింది కదా అని రెండవ నెంబర్ పెట్టుకున్నాము, అది కూడా బ్యాన్ అయ్యింది. ఎంతోభరించి బాధని దిగమింగుకొని మూడవ నెంబర్ కూడా తీసుకున్నాము, నాలుగు రోజుల తర్వాత అది కూడా బ్యాన్ అని చూపిస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు కదా, గాయమైన చోటే రోకలి పోటు అని, మాకంటూ ఫైనాన్సియల్ గా ఏదైనా ఉంది అంటే, అది ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మాత్రమే. దీనిని నమ్ముకొని నా కుటుంబం తో పాటు కొన్ని కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. ఆర్డర్స్ పెట్టాలని అనుకున్నవాళ్ళు మా వెబ్ సైట్ లోకి వెళ్లి పెట్టొచ్చు, లేకపోతే మా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఆర్డర్స్ చేయొచ్చు’ అంటూ చెప్పుకొచ్చింది అలేఖ్య చిట్టి.
అయితే అలేఖ్య చిట్టి పికిల్స్ వాట్సాప్ నెంబర్ అన్ని సార్లు బ్లాక్ అవ్వడానికి కారణం ఏమి అయ్యుటుంది? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక శాతం మంది కస్టమర్లు రిపోర్ట్స్ కొట్టడం వల్లే ఇలా అయ్యి ఉంటుందని అంటున్నారు. అంటే ఈమెపై జనాలు ఇంకా కోపం గానే ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆర్డర్లు పెట్టమని చెప్తుంది. ఆమెకు వచ్చే ఆర్డర్స్ కంటే తిడుతూ మెసేజ్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారేమో. ఇలాంటి పరిస్థితిలో ఈ అక్కచెల్లెలు నెగటివిటీ ని తట్టుకొని ఎలా ఈ వ్యాపారం ని ముందుకు కొనసాగిస్తారో చూడాలి. మరోపక్క ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళలో ఒకరికి బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనే అవకాశం వచ్చిందట. ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.