Alcohol Teaser Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లరి నరేష్ లాంటి నటుడు సైతం వైవిద్య భరితమైన కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…ఇప్పటివరకు అల్లరి నరేష్ చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటున్నాయి. నాంది సినిమా నుంచి ఆయన స్టోరీ సెలెక్షన్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం ‘మెహర్ తేజ’ దర్శకత్వంలో ‘ఆల్కహాల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ ను అయితే కట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఇక ఇందులో అల్లరి నరేష్ ఆల్కహాలు తాగని ఒక వ్యక్తిగా కనిపించాడు. కమెడియన్ సత్య ఎలాగైనా సరే తన కింద పని చేసే అల్లరి నరేష్ తో ఆల్కహాల్ తాగించాలనే ప్రయత్నం చేశాడు. ఇక తను ఆల్కహాల్ తాగిన తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. అల్లరి నరేష్ ఫ్రెండ్స్ సైతం మందు తాగడానికి పిలిపించి మరి వాళ్ళు ఆల్కహాల్ తాగితే కొట్టను చంపేస్తాను అంటూ చెప్పే డైలాగు ఈ టీజర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
Also Read: కల్వకుంట్ల కవిత చెప్పింది అబద్దమా… వైఎస్ ను హరీష్ అందుకే కలిశారా.. వెలుగులోకి సంచలన వీడియో
ఈ సినిమా మొత్తం ఆల్కహాల్ మీదనే బేస్ చేసుకుని ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆల్కహాల్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లరి నరేష్ కి డిఫరెంట్ గా సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో వైవిధ్యమైన కథాంశాలను చేస్తున్నాడు.
కాబట్టి అందులో ఇది కూడా ఒకటని తన అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ సినిమాలో దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు. ఆల్కహాల్ తాగితే తప్పని చెప్పాలనుకున్నాడా? లేదంటే ఆల్కహాల్ తాగడం వల్ల అనర్ధాలు జరుగుతాయనే పాయింట్ ను ఎలివేట్ చేసి చెప్పబోతున్నాడా? ఏ ధోరణిలో ఆలోచించి ఈ సినిమాని చేస్తున్నాడు అనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది.
నిజానికి ఆల్కహాల్ అనేది నెగెటివ్ వర్డ్ దాన్ని టైటిల్ గా పెట్టి ఆయన సోనియా చేయడం అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇంతకుముందు ఈ దర్శకుడు సుహాస్ తో కలిసి ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా అయితే చేశాడు. ఈయన చేసిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కాయి. మరి ఇలాంటి సందర్భంలోనే మరోసారి కొత్త గా ఉండాలనే ఉద్దేశంతోనే డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది…