https://oktelugu.com/

Constitution of India: భారత రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Constitution of India: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం మొదటిది. దీంతో మన రాజ్యాంగానికి ఉన్న ఖ్యాతి అలాంటిది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవంగా పిలుచుకునే నేటి రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అసలు మన రాజ్యాంగం 1949 డిసెంబర్ 26నే తయారయినా దాని అమలుకు మాత్రం సమయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో జనవరి 26న దాని అమలు చేసి దానికి శ్రీకారం చుట్టిన సంగతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 26, 2022 / 04:42 PM IST
    Follow us on

    Constitution of India: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం మొదటిది. దీంతో మన రాజ్యాంగానికి ఉన్న ఖ్యాతి అలాంటిది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవంగా పిలుచుకునే నేటి రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అసలు మన రాజ్యాంగం 1949 డిసెంబర్ 26నే తయారయినా దాని అమలుకు మాత్రం సమయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో జనవరి 26న దాని అమలు చేసి దానికి శ్రీకారం చుట్టిన సంగతి విధితమే. ప్రస్తుతం 73వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

    Constitution of India

    భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరిస్తున్నట్లు చివరి గవర్నర్ జనరల్ రాజగోపాలచారి ప్రకటించారు. జనవరి 26న ఉదయం 10.18 గంటలకు గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించింది. తరువాత డాక్టర్ రాజేంద్రప్రసాద్ మొదటి రాష్ర్టపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మన దేశం సర్వసత్తాక రాజ్యంగా ఆవిర్భవించింది. దీన్నే రిపబ్లిక్ డేగా పిలుస్తున్నారు.

    Also Read: పద్మభూషణ్ అవార్డును బుద్ధదేవ్ భట్టాచార్య ఎందుకు తిరస్కరించారు?

    రిపబ్లిక్ దినోత్సవాన్ని మనం గర్వించుకునేలా నిర్వహించుకుంటాం. కన్నుల పండుగగా వేడుకలు చేస్తాం. ఆగస్టు 15న ప్రధానమంత్రి, 26 జనవరిన రాష్ర్టపతి ప్రసంగం ఉంటుంది. దేశం సాధించిన విజయాలు స్మరిస్తూ దేశం గొప్పతనాన్ని చాటుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా గడుపుకునే పండుగే గణతంత్ర దినోత్సవం. దీనికి అందరు సహకరిస్తారు.

    మన రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది. రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949నే పూర్తి చేసినా ఆమోదం కోసం జనవరి 26 దాకా ఆగాల్సి వచ్చింది. దీంతో జనవరి 26కు ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో భారత దేశానికి గుర్తింపు లభించింది. దీంతోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందింది.

    Also Read: విరిసిన మన ‘పద్మాలు’: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల సక్సెస్ స్టోరీ తెలుసా..?

    Tags