బేర్ గ్రిల్స్ తో అక్షయ్ సాహసం చూడాల్సిందే..!

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అడవిలో రియల్ సాహసం చేశారు. డిస్కవరీ ఛానెల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరుతో వస్తున్న కార్యక్రమం కోసం అక్షయ్ కుమార్ బేర్ గ్రిల్స్ తో కలిసి అడవిలో సాహాసయాత్ర చేశాడు. ఇందుకు సంబంధించిన టీజర్ అక్షయ్ కుమార్ తన ట్వీటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. Also Read : సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..! బేర్ గిల్స్ తో […]

Written By: Neelambaram, Updated On : August 31, 2020 7:05 pm
Follow us on

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అడవిలో రియల్ సాహసం చేశారు. డిస్కవరీ ఛానెల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరుతో వస్తున్న కార్యక్రమం కోసం అక్షయ్ కుమార్ బేర్ గ్రిల్స్ తో కలిసి అడవిలో సాహాసయాత్ర చేశాడు. ఇందుకు సంబంధించిన టీజర్ అక్షయ్ కుమార్ తన ట్వీటర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Also Read : సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

బేర్ గిల్స్ తో కలిసి అక్షయ్ కుమార్ అడవిలో ఎన్నో యాక్షన్ స్టంట్స్ చేశాడు. 60సెకన్ల నిడివి గల ఈ టీజర్ ఆద్యాంతం ఆకట్టుకునేలా ఉంది. అడవిలో పిచ్చి సాహసం.. డేర్‌డెవిల్ ద్వయం చూడండి.. అంటూ టీజర్ ప్రారంభం అవుతోంది. యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ‘లెజెండ్’గా అక్షయ్‌ను బేర్ పరిచయం చేయగా.. నేను రీల్ హీరో, అతను నిజమైన హీరో.. అంటూ అక్షయ్ బేర్ ను ప్రశంసిస్తాడు.

ఈ టీజర్లో బేర్.. అక్షయ్ కుమార్ ఇద్దరు అడవిలో రఫ్ చేయడం.. మొసలి ఉన్న నీటిపై నుంచి వెళ్లడం.. అక్షయ్ ‘ఏనుగు పూప్ టీ’ సిప్  చేయడం వంటి దృశ్యాలను చాలా థ్రిల్లింగ్ గా చూపించారు. వీరిద్దరు ఒళ్ళు గగుర్పొడిచేలా సాహసాలు చేసినట్లుగా కన్పిస్తుంది. దీంతో అక్షయ్ అభిమానులు ‘ది వైల్డ్’ పూర్తి ఎపిసోడ్ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో రూపొందుతున్న ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ యాప్ లో సెప్టెంబర్ 11న, డిస్కవరి ఛానల్లో సెప్టెంబర్ 14న ప్రసారం కానున్నట్లు టీజర్లో చూపించారు. గతంలో భారత ప్రధాని మోదీ, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం బేర్ తో కలిసి సాహస యాత్ర చేశారు.

Also Read : నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్