రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా గణేశ్ నవరాత్రులు కళతప్పిపోయాయి. ప్రతియేటా అంగరంగ వైభవంగా కొనసాగే ఉత్సవాలు ఈసారి సాదాసీదాగా జరిగాయి. పల్లెపల్లెనా.. వీధివిధినా కన్పించే గణేశ్ విగ్రహాలు ఈసారి పెద్దగా కన్పించలేదు. కరోనా నిబంధనల కారణంగా ఉత్సవ కమిటీ నిర్వహాకులు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. దీంతో కిందటేడాది కంటే ఈసారి గణేష్ విగ్రహాలు సంఖ్య భారీగా తగ్గిపోయింది. ప్రతీయేటా హాట్ కేకుల్లా అమ్ముడుపోయే గణేష్ విగ్రహాలు ఈసారి పెద్దగా అమ్ముడుపోక వ్యాపారులు కూడా నష్టపోయినట్లు తెలుస్తోంది.
Also Read : బాలయ్య మంత్రం.. కరోనా పరార్ అవాల్సిందే?
కరోనా నిబంధనల కారణంగా ప్రజలంతా ఈసారి ఇళ్లల్లోనే గణేషుడికి పూజలు నిర్వహించుకున్నారు. పలువురు కరోనా నిబంధనలు పాటిస్తూ అక్కడక్కడ గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పోలీసుల సూచనలను పాటిస్తూ నవరాత్రుల్లో గణేషుడికి పూజలు నిర్వహించారు. కొద్దిరోజులుగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ఈమేరకు పోలీస్ యంత్రాంగం కూడా గణేష్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేసింది.
నేటితో నవరాత్రులు ముగిస్తుండటంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో నిర్వహించే గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనాలు తరలివచ్చేవారు. అయితే ఈసారి ట్యాంకుబండ్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం సాదాసీదాగా కొనసాగేలా కన్పిస్తున్నాయి. గత వారం నుంచి హైదరాబాద్లో నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటికే 30వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు తెలిపారు.
ఈమేరకు గణేష్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా 21 క్రేన్లను ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు 5 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తున్న 165విగ్రహాలు.. 3నుంచి 5ఫీట్ల వరకు ఉన్న 1,239.. 3 ఫీట్ల కంటే తక్కువ ఉన్న 1842విగ్రహాలు నిమజ్జనం కాబోతున్నాయని తెలిపారు. 1500పైగా పోలీసులతో భద్రతా ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఇతర వాహనాలకు అనుమతి లేదని, పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్ చేశామని.. ప్రజలంతా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. దీంతో గణేష్ నిమజ్జనం హడావుడి లేకుండానే మమ అనిపించేస్తున్నారు. మాయదారి మహమ్మరి వల్ల ఈ ఏడాది అన్ని పండుగలు కళతప్పిపోవడం శోచనీయంగా మారింది.
Also Read : కరోనా వైరస్ నుంచి రక్షించే ఏకైక విటమిన్ ఇదే!