https://oktelugu.com/

మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

రాజకీయాలను.. మీడియాలను విడదీయలేం.. సొంతంగా మీడియా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలం. ఇప్పుడు తెలుగు నాట చూసుకున్నా.. కేంద్రంలో చూసుకున్నా.. ప్రతీపార్టీకి బలమైన మీడియా ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానెల్ సొంతంగా ఉండగా.. టీవీ9 లాంటి పెద్ద చానెల్ సపోర్టు ఉంది. ఇక ఏపీలో వైసీపీకి సాక్షి మీడియా, టీడీపీకి ఏబీఎన్, ఈనాడు సహా పలు మీడియా చానెళ్ల మద్దతు ఉంది. మీడియా చేతిలో లేకుంటే ఏ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లిలేకపోతుందని.. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2020 / 07:19 PM IST

    BJP in the media? Negotiations with those two channels!

    Follow us on


    రాజకీయాలను.. మీడియాలను విడదీయలేం.. సొంతంగా మీడియా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలం. ఇప్పుడు తెలుగు నాట చూసుకున్నా.. కేంద్రంలో చూసుకున్నా.. ప్రతీపార్టీకి బలమైన మీడియా ఉంది.

    తెలంగాణలో టీఆర్ఎస్ కు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానెల్ సొంతంగా ఉండగా.. టీవీ9 లాంటి పెద్ద చానెల్ సపోర్టు ఉంది. ఇక ఏపీలో వైసీపీకి సాక్షి మీడియా, టీడీపీకి ఏబీఎన్, ఈనాడు సహా పలు మీడియా చానెళ్ల మద్దతు ఉంది. మీడియా చేతిలో లేకుంటే ఏ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లిలేకపోతుందని.. అందుకే రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే మీడియా సపోర్టు అవసరమని అన్ని పార్టీలు భావించి పలు మీడియా సంస్థల్లో తెరవెనుక పెట్టుబడులు పెడుతుంటాయి.

    Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

    ఈ క్రమంలోనే తెలంగాణలో బలపడాలని ఆశిస్తున్న బీజేపీ కూడా ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు కుదేలవుతున్న వేళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్మయంగా బీజేపీ ఎదుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి మద్దతు అవసరం అని బీజేపీ భావిస్తోంది. బలమైన మీడియా ఉంటే తప్పా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని కమలదళం భావిస్తోంది. తమకు కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించిందని.. మీడియాలను కొనడానికి యోచిస్తున్నామని తెలంగాణ బీజేపీ నాయకులు అంటున్నారు.

    తెలంగాణలో బీజేపీ రెండు మధ్యస్థాయి చానెళ్లను కొనడానికి రెడీ అయ్యిందని సమాచారం. బీజేపీ అనుకూల వైఖరితో ఉడే జర్నలిస్టులను, సీఈవోను, చీఫ్ ఎడిటర్ ను నియమించాలని శూలశోధన మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ చానెళ్ల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.బీజేపీ కేంద్రంలోని పెద్దలతో ఈ చానెళ్ల యజమానులతో మాట్లాడిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.

    ప్రస్తుతం తెలంగాణలో రెండు మీడియా సంస్థలను కొనే పనిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది. కాగా ఈ చానెల్ లను స్వాధీనం చేసుకోవడానికి.. వాటిని నడపడానికి బీజేపీలోని కొంతమంది వ్యాపారులను ఒప్పించారని వార్తలు వస్తున్నాయి.

    2024 ఎన్నికలకు ముందు మీడియాలో బలమైన గొంతుకగా బీజేపీని మలచాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ రెండు చానెళ్లలో ఒకటి స్థానిక చానెల్. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరొకటి తమిళనాడులో హెడ్ ఆఫీస్ కలిగి ఉంది. ఈ రెండింటిని కొనేందుకు బీజేపీ చర్చలు జరుపుతోందని సమాచారం.

    -నరేశ్

    Also Read : బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం