Bollywood Star Hero: మరో సౌత్ డైరెక్టర్ పైన కన్నేసిన బాలీవుడ్ స్టార్ హీరో…

ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీని వాడుతూ సౌత్ దర్శకులను లైన్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే షారుక్ ఖాన్ లాంటి డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ అనే సినిమా తీసి 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు.

Written By: Gopi, Updated On : May 20, 2024 4:59 pm

Akshay Kumar wants to movie with South Directors

Follow us on

Bollywood Star Hero: ప్రస్తుతం పాన్ ఇండియాలో సౌత్ డైరెక్టర్ల హవా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్లు చేసిన ప్రతి సినిమా కూడా ఇండియా వైడ్ గా సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా సౌత్ సినిమా దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా మరికొంత మంది సౌత్ దర్శకులను లైన్ లో పెట్టడానికి బాలీవుడ్ హీరోలు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందుకే ఒక్కో హీరో ఒక్కో స్ట్రాటజీని వాడుతూ సౌత్ దర్శకులను లైన్ లో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే షారుక్ ఖాన్ లాంటి డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో జవాన్ అనే సినిమా తీసి 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు. అందుకే ఆయన మరోసారి సౌత్ డైరెక్టర్ ల పైన ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా సౌత్ డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఆయన పలు రకాల దర్శకులతో పని చేసినప్పటికీ తమిళ్ సినిమా దర్శకుడు అయిన ‘లింగు స్వామి’ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం లింగస్వామి పెద్దగా ఫామ్ లో అయితే లేడు. చివరగా ఆయన తెలుగులో రామ్ తో తీసిన ‘వారియర్ ‘ అనే సినిమా చేశాడు ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అయినప్పటికీ ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు సిద్దపడుతున్నారు అంటే సౌత్ సినిమా దర్శకుల హవా ఎంతలా పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తానికైతే వాళ్ళు సినిమా చేయడానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన ఒక డైరెక్టర్ ఉంటే సరిపోతుంది.

వాళ్లకు హిట్టు ఉందా ఫ్లాప్ ఉందా అనే విషయం కూడా ఆలోచించడం లేదు. ఇక సౌత్ సినిమా డైరెక్టర్ల సెంటిమెంట్ అనేది బాగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో లింగుస్వామి భారీ సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది…