Homeఎంటర్టైన్మెంట్Akshay Kumar NTR Movie: పాక్ - ఇండియా మధ్య యుద్ధంలో ఎన్టీఆర్ - ...

Akshay Kumar NTR Movie: పాక్ – ఇండియా మధ్య యుద్ధంలో ఎన్టీఆర్ – అక్షయ్ కుమార్

Akshay Kumar NTR Movie: తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ఆ స్థాయి ఉన్న డైరెక్టర్ లిస్ట్ లో మొదటి ప్లేస్ ‘కొరటాల శివ’దే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ సైతం కొరటాల శివ పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారంటే అది కొరటాల డైరెక్షన్ స్కిల్ కి దక్కిన గౌరవం. మరి అలాంటి డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలకు మోక్షం కలిగింది.

OKtelugu Movie Time
Jr NTR and Koratala Shiva

కొరటాల శివతో ఇప్పటికే ఎన్టీఆర్ తర్వాత సినిమాని అఫీషియల్‌ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. కొరటాల ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుందని తెలుస్తోంది.

Also Read:  త్రివిక్రమ్ కి యాక్షన్ సెట్ కాదు అంటున్న మహేష్

అలాగే ఆ తర్వాత పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం వరకూ.. ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో కొరటాల ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు.

Akshay Kumar NTR
Akshay Kumar NTR

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి… గొప్ప యాక్షన్ డ్రామాగా ఈ సినిమా నిలుస్తోందని మేకర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. దాంతో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరో పాత్ర ఉంది. ఆ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

ఎందుకంటే ఎన్టీఆర్ కి సినిమాలో అది బాబాయ్ పాత్ర అట. వెరీ ఎమోషనల్ గా ఉండే ఆ పాత్రలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: అఖిల్, స్రవంతిలు ముమైత్ ఖాన్ గురించి ఏం మాట్లాడారో తెలుసా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version