అన్నిటికీ మించి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో మేటి నటుడిగా అశేష ప్రేక్షకులను అలరించిన హీరో కూడా. అంత గొప్ప గుర్తింపు పొందిన ఏఎన్నార్ గురించి బయోపిక్ వస్తే బాగుంటుంది అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య నాగార్జున కూడా ఏఎన్నార్ బయోపిక్ గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పారు.
మళ్ళీ ఆ తర్వాత నాగ్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏఎన్నార్ పోషించిన పాత్రలను మళ్ళీ ఎవరు పోషించి మెప్పించగలరు. ఏఎన్నార్ పాత్రలకు న్యాయం చేయగలరని అనిపించేలా నేటి జనరేషన్ లో ఒక మంచి నటుడు కావాలి. అయితే, వారసులు కాకుండా వేరే నటుడిని పెడితే.. సహజంగా అనిపించకపోవచ్చు.
అయితే, ఏఎన్నార్ లోకి ఆయన పాత్రల్లోకి ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసి నటించే వారసుడు ఎవరు అనేది చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ గారికి దీటుగా నటిస్తూ, మెప్పిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఏఎన్నార్ లా నటించాలి అంటే మాటలు కాదు. ఒక్కటి మాత్రం నిజం, ఈ తరానికి ఏఎన్నార్ జీవితం ఒక ఆదర్శం.
నటన పరంగా మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, జీవన విధానం, ఆరోగ్య సూత్రాలు అద్భుతం. అందుకే ఆయన జీవితాన్ని ఆధారంగా బయోపిక్ వస్తే బాగుంటుంది. కానీ తీసేది ఎవరు ?