Bigg Boss 9 Telugu Nagarjuna: దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) ఫ్రస్టేషన్లో ఉన్నారా? ఎలాంటి దువ్వాడ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు? అటు భార్య పిల్లలకు దూరమయ్యానన్న బాధతో అలా అంటున్నారా? లేకుంటే తన సహచరి మాధురి దూరంగా ఉందన్న బెంగతో ఉన్నారా? ఇప్పుడు దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ నాయకుడు. దూకుడు కలిగిన నేత. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న తరుణంలో దూకుడు తనంతో రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు వ్యక్తిగత, కుటుంబ వ్యవహార శైలితో ఈ స్థాయికి పడిపోయారు. అయితే ఇప్పటివరకు ఆయనది వ్యక్తిగత వ్యవహారమే అనుకోవచ్చు. కానీ మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించడం.. ఆమెకు మద్దతుగా నిలిచే క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వెగటు పుట్టిస్తున్నాయి.
హెచ్చరించినంత పని..
అసలు దువ్వాడ శ్రీనివాస్ సహచరి అనాలో.. సన్నిహితురాలు అనాలో తెలియడం లేదు మాధురి విషయంలో. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి( Bigg Boss house) ప్రవేశించిన క్రమంలో పరిచయ కార్యక్రమంలో దువ్వాడ మాధురీగానే పేర్కొన్నారు. అయితే కేవలం ప్రచారం కోసమే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. కానీ అక్కడ అందరి కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకున్నారు. ఆమెకు మద్దతుగా ప్రచారానికి దిగారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇప్పటివరకు అది కుటుంబ వ్యవహారమే అని అంతా భావించారు. దువ్వాడ శ్రీనివాస్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రకటనలు చూస్తుంటే మాత్రం ఇక రాజకీయాలు కష్టమేనన్న మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ ఒకరు దువ్వాడ మాధురికి అంత సీన్ లేదని అనేసరికి.. దువ్వాడ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. మీ తండ్రి తెలుసు.. మీ ఇల్లు తెలుసు.. అంటూ హెచ్చరించినంత పని చేశారు. అయితే ఎలా ఉన్న దువ్వాడ శ్రీనివాస్.. ఎలా మారిపోయాడు అంటూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆశ్చర్యపోయారు.
రాజకీయంగా కష్టమే..
ఇప్పటివరకు దువ్వాడ శ్రీనివాస్, మాధురి వ్యవహార శైలిని వ్యక్తిగతంగానే చూశారు. కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లోకి మాధురి ( Madhuri)ప్రవేశించిన తర్వాత మారిన పరిణామాలతో ఇక దువ్వాడ శ్రీనివాస్ పని అయిపోయిందన్న వారు ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని దువ్వాడ శ్రీనివాస్ బలంగా నమ్ముతూ వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత విషయంలో సానుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మిగతా వైసీపీ నేతలను దారుణంగా వ్యాఖ్యానించారు. వారి వల్లే తనపై వేటు పడిందని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా తన ప్రత్యర్థి కింజరాపు కుటుంబం పై కూడా మాట్లాడారు. దీంతో కూటమిలో కూడా ఆప్షన్ లేకుండా చేసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి మాధురి ప్రవేశం, తర్వాత ఎలిమినేట్ కావడంతో.. ఒక ప్రస్స్టేషన్ లో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న కామెంట్స్ మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. దాదాపు రాజకీయ మార్గాలు మూసుకుపోతున్నాయి. ఆయన హెచ్చరికలు చూస్తుంటే.. మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ ఆదివారం ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు అక్కినేని నాగార్జున పై కూడా కామెంట్స్ చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్ వెనుకడుగు వేయరని అందరూ అనుకుంటున్నారు..