Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన చిత్రం తర్వాత బుచ్చి బాబు ఏకంగా రామ్ చరణ్ రేంజ్ హీరో కి కథని వినిపించి, దానిని ఒప్పించి సెట్స్ మీదకు తీసుకొచ్చాడంటే, ఆ చిత్రం కథ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు. యదార్ధ సంఘటనల ఆధారంగా, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది కానీ, అందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది ఇప్పటి వరకు తెలియదు. అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి వెన్నుముక లాంటిది అట. ఈ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ ఏకంగా పది కిలోల బరువు తగ్గుతున్నాడట. సినిమా కోసం ఇంత డెడికేషన్ ని చూపించిన హీరోలు రామ్ చరణ్ కి ముందు అమీర్ ఖాన్, విక్రమ్. అమీర్ ఖాన్ దంగల్ చిత్రం లో కేవలం 5 నిమిషాల సన్నివేశం కోసం సిక్స్ ప్యాక్ పెంచాడు.
ఇక విక్రమ్ అయితే శంకర్ తెరకెక్కించిన ఐ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో మనమంతా చూశాము. ఇప్పుడు వాళ్ళ జాబితాలోకి రామ్ చరణ్ కూడా వెళ్ళిపోయాడు. ఛాలెంజింగ్ రోల్స్ అంటే రామ్ చరణ్ నటించడు, జీవిస్తాడు. బుచ్చి బాబు సినిమాలో కూడా ఆయన ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాడు. ఈసారి రామ్ చరణ్ సహజ నటనకు నేషనల్ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఆ రేంజ్ లో ఆ పాత్ర ఉంటుందట. ప్రతీ నెల భారీ షెడ్యూల్స్ ని ఏర్పాటు చేసి, అనుకున్న నిర్దిష్ట సమయంలో షూటింగ్ ని పూర్తి చేసి, ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ కంటెంట్ ఉన్న సినిమాలకు సంగీత దర్శకుడిగా AR రెహమాన్(AR Rehman) ని తీసుకున్నప్పుడే బుచ్చి బాబు సగం సక్సెస్ అయిపోయాడు.
ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్(Jhanvi Kapoor) నటిస్తుంది. ‘దేవర’ చిత్రం ద్వారా ఈమె మన టాలీవుడ్ కి పరిచయమైంది. కేవలం అందంతోనే కాదు, నటనలో కూడా మంచి పొటెన్షియల్ ఉన్న అమ్మాయి అని మన తెలుగు ఆడియన్స్ కి దేవర చూసినప్పుడే అర్థమైంది కానీ, ఆమెకి సరైన పాత్ర రాయలేదనే ఫీలింగ్ వచ్చింది. కానీ బుచ్చి బాబు ఆమెకి ఇప్పుడు చేస్తున్న రామ్ చరణ్ చిత్రంలో చాలా బలమైన క్యారక్టర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ రామ్ చరణ్ కి గురువు పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా ఇతర బాషల నుండి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి ని ఒక ముఖ్య పాత్ర కోసం అడిగారట కానీ, ఆయన డేట్స్ అందుబాటులో లేకపోవడం తో తప్పుకోవాల్సి వచ్చింది.