OG 2 Nagarjuna: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ఓజీ(They Call Him OG) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో క్లీన్ సూపర్ హిట్ ని అందుకోబోతున్నాడు. మధ్యలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సెమీ హిట్స్ వచ్చాయి కానీ, అవి ప్రతీకూల పరిస్థితులు కారణంగా భారీ కలెక్షన్స్ ని చూడలేకపోయాయి. కానీ ఓజీ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు అభిమానులు ప్రతీ సన్నివేశాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఓజీ సీక్వెల్ ఉంటుంది అని ప్రకటించడం అభిమానులకు మంచి కిక్ ని ఇచ్చింది. అయితే ఈమధ్య కాలం లో ప్రతీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటిస్తున్నారు కానీ, అలాంటిదేమి జరగడం లేదు, ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో అని అనుకున్నారు ఫ్యాన్స్.
కానీ నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో మెగా ఫ్యామిలీ తో కలిసి సినిమా చూసిన పవన్ కళ్యాణ్, చివర్లో మాట్లాడుతూ ఓజీ యూనివర్స్ లో నటించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని అధికారిక ప్రకటన చేసాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. అయితే ఓజీ సీక్వెల్ ని మామూలు రేంజ్ లో ప్లాన్ చేయడం లేదట డైరెక్టర్ సుజీత్. పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ స్టార్స్ అందరినీ ఈ చిత్రం కోసం తీసుకొస్తున్నాడట. అందులో భాగంగా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ని ఈ చిత్రంలో మెయిన్ విలన్ క్యారక్టర్ కోసం అడిగే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రీసెంట్ గానే నాగార్జున లీడ్ రోల్స్ మాత్రమే కాకుండా, స్పెషల్ రోల్స్ చేసేందుకు రెడీ అని ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే ఆయన నుండి కుబేర, కూలీ చిత్రాలు వచ్చాయి. కూలీ లో ఆయన పోషించిన విలన్ క్యారక్టర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు మొదట్లో నాగార్జున విలన్ క్యారక్టర్ చేయడం పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ విడుదల తర్వాత ఆయనకు ఆ క్యారక్టర్ ద్వారా వచ్చిన క్రేజ్ ని చూసి సంతోషించారు. గత పదేళ్లలో హీరో గా ఎన్ని సినిమాలు చేసినా రానటువంటి రెస్పాన్స్ ని నాగార్జున ఈ సినిమా ద్వారా చూసారు. అందుకే భవిష్యత్తులో కూడా ఆయన అలాంటి క్యారెక్టర్లు చేయడానికి రెడీ అని చెప్పడం తో, సుజిత్ నాగార్జున ని సంప్రదించే ఆలోచనలో పడ్డాడట. మరి నాగార్జున అందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి.