Thank You Movie Collections: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘థాంక్యూ ‘ సినిమా ఇటీవలే భారీగా అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన సినిమా అంటే ప్రేక్షకులు కచ్చితంగా కథ మరియు కథనం లో వైవిద్యం కోరుకుంటారు..ఆ వైవిద్యం పూర్తి లోపించడం..సినిమా స్టోరీ చాలా రొటీన్ గా అనిపించడం వల్లే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలైంది అని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు..ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చేవి..వీకెండ్ వరుకు డీసెంట్ వసూళ్లను బయ్యర్లు చూసేవారు..ఇప్పుడు ఫ్లాప్ టాక్ వస్తే పరిస్థితి అతి నీచంగా ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచింది నాగ చైతన్య థాంక్యూ సినిమా..మొదటి రోజు కనీసం రెండు కోట్ల షేర్ వసూళ్లను కూడా దక్కించుకోలేకపోయిన ఈ సినిమా..రెండవ రోజు నుండి మరీ దారుణంగా కోటి రూపాయిలకంటే తక్కువ షేర్ ని వసూలు చెయ్యడం ఈ సినిమాని కొన్న బయ్యర్లకు చావు దెబ్బలాగా నిలిచింది..మూడవ రోజు కూడా ఇదే పరిస్థితి..మొదటి రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..ఇది అక్కినేని ఫామిలీ కి అవమానకరమైన వసూళ్లు అనే చెప్పొచ్చు.
పరిస్థితి ఇలాగె కొనసాగితే ఇప్పటి వరుకు వచ్చిన మూడు కోట్ల రూపాయిలు కూడా నేటి నుండి తగ్గిపోతూ వెళ్తూ జీరో షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఎందుకంటే నేటి నుండి ఈ సినిమాకి ఏ ప్రాంతం లో కూడా షేర్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో థియేటర్స్ ఎక్కువ శాతం రెంటల్ మీద నడుస్తుంది కాబట్టి..థియేటర్స్ రెంట్స్ మరియు టాక్సులు డైలీ వచ్చే వసూళ్ళలో కట్ చేసుకుంటే డెఫిసిట్స్ వచ్చే అవకాశాలే ఎక్కువ..దాని వల్ల వచ్చిన షేర్ కూడా తగ్గిపోతూ వెళ్తూ మొదటి వారం లోనే జీరో షేర్ వచ్చే అవకాశాలు ఉంటాయని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..ఇదే కనుక జరిగితే అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘ఆఫీసర్’ సినిమా తర్వాత జీరో షేర్ ని సాధించిన ఏకైక సినిమాగా థాంక్యూ చిత్రం నిలిచిపోతుంది.
Also Read: Sai Pallavi: సాయిపల్లవి బోనమెత్తితే ఎట్టుంటాదో తెలుసా?
జీరో షేర్ సాధించిన రెండు సినిమాలు కూడా అక్కినేని ఫామిలీ సినిమాలు కావడం మరో విశేషం గా చెప్పుకోవచ్చు..వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగ చైతన్య కి..మరియు నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా వరుస విజయాలను చూస్తున్న దిల్ రాజు కి ఈ సినిమా కోలుకోలేని చావు దెబ్బ అని చెప్పొచ్చు.