Breast Cancer: ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పని, ఆఫీస్‌లో పని వల్ల వాళ్ల ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. దీంతో వాళ్లు ఒత్తిడికి గురి అయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజుల్లో మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే గుండె సమస్యలు, మధుమేహం వంటి వాటితో కూడా మహిళలు బాధపడుతున్నారు. బిజీగా ఉండటం వల్ల వాళ్ల ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. జ్వరం, ఇంకా ఏదైనా వచ్చిన కూడా ఏం కాదులే అని వదిలేస్తారు. ఇలా చిన్న సమస్యలను పెద్దగా చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే డైలీ తీసుకునే కొన్ని ఆహారాల వల్ల మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ఆహారాలు ఎక్కువ అయ్యాయి. వీటివల్ల మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం తినే ప్రతీ వస్తువు కూడా ప్లాస్టిక్‌తోనే వస్తుంది. చిన్న పిల్లలు తినే పదార్థాల నుంచి అన్ని కూడా ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు, వాటి ముక్కలను కూడా కట్ చేసి ప్లాస్టిక్ దాంట్లోనే అమ్ముతున్నారు. ఎక్కువ రోజలు ప్లాస్టిక్‌లో నిల్వ ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా మహిళలు అయితే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్లాస్టిక్‌లో ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా తినడం మానేయాలి. వీటివల్లే సగం వ్యాధులన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌లోనే ఎన్నో రకాల హానికరమైన రసాయనాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
ప్లాస్టిక్ ప్యాకెట్‌లో పీఎఫ్‌ఏ పాలేట్లు ఉంటాయి. ఇవి అంత తొందరగా నశించవు. ఇందులో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అందులోని రసాయనాలు ఈజీగా కడుపులోకి వెళ్లిపోతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదాకర వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన పదార్థాలు అసలు తినకూడదు. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ కూడా అన్నింటికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. ఆఖరికి తినే ప్లేట్లు కూడా ప్లాస్టిక్. పిల్లలు వాడే వాటర్ బాటిల్, స్నాక్స్, లంచ్ ఇలా అన్నింటికి కూడా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్లాస్టిక్‌లో కొన్ని రకాలు కూడా ఉంటాయి. నాణ్యత ఉన్నవి, లేనివి కూడా ఉంటాయి. నాణ్యత ఉన్నవి కొన్ని రకాలు వాడిన శరీరానికి పెద్ద ప్రమాదం ఉండదు. కానీ నాణ్యత లేని ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల తప్పకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇకనైనా ప్లాస్టిక్ ఉన్న పదార్థాలను తీసుకోవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.