Akkineni Akhil’s Wedding Photos : అక్కినేని అఖిల్(Akkineni Akhil) పెళ్లి నేడు తెల్లవారు జామున మూడు గంటలకు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని కుటుంబ సభ్యులు, నాగార్జున కి అత్యంత సన్నిహితుల సమక్షం లో గ్రాండ్ గా జరిగింది. తెల్లవారు జామున వివాహం కావడమతొ సినీ, రాజకీయ రంగాల నుండి కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు. నాగార్జున(Akkineni Nagarjuna) కి అత్యంత సన్నిహితులైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మొత్తం ఈ పెళ్ళికి హాజరైంది. అదే విధంగా ఇండస్ట్రీ నుండి ప్రశాంత్ నీల్, అల్లు అరవింద్ తదితరులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. గత నెలలో జైనబ్ అనే అమ్మాయితో అఖిల్ కి నిశ్చితార్థం జరిగింది. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya),శోభిత(Sobhita Dhulipala) జంటకు నిశ్చితార్థం జరిగిన కొన్నాళ్లకే వీళ్లిద్దరికీ జరిగింది. ఇప్పుడు వీళ్లిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలోనే రిసెప్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు.
వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో కొన్ని లీకై బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి కొడుకు అవతారం లో అఖిల్ ని చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే కెరీర్ పరంగా ఎందుకో అఖిల్ కి ఇప్పటి వరకు ఏది కలిసి రాలేదు. అందం, అద్భుతమైన టాలెంట్, కష్టపడి పని చేసే తత్త్వం ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఆయనకు అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించలేదంటే అతిసయోక్తి కాదేమో. అయితే పెళ్లి తర్వాత అనేక మంది హీరోల జాతకాలు మారిపోయాయి. ఉదాహరణకు అక్కినేని నాగ చైతన్య నే తీసుకోండి. శోభిత తో పెళ్ళికి ముందు నాగ చైతన్య కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే ఆమెని పెళ్లి చేసుకున్నాడో, కొన్నాళ్లకే ఆయన నుండి విడుదలైన ‘తండేల్’ చిత్రం ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము.
Also Read : మరో జాక్ పాట్ కొట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్..ఒకే రోజు 2 బ్లాక్ బస్టర్స్!
ఇలా అక్కినేని అఖిల్ కి కూడా పెళ్లి తర్వాత అన్ని కలిసి వస్తాయని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 2023 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చాలా కాలం వరకు గ్యాప్ తీసుకొని ‘లెనిన్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అఖిల్ కి ఇంకా మాస్ రోల్స్ ని చేసేంత వయస్సు రాలేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అందుకు సరిపోవడం లేదు. అలాంటి సమయం లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తే లాభం ఉంటుంది కానీ, మళ్ళీ మళ్ళీ మాస్ రోల్స్ అంటే చేతులు కాల్చుకోవడం తప్ప మరొకటి లేదని అభిమానుల అభిప్రాయం. లెనిన్ ని చూస్తుంటే మాస్ సినిమా లాగానే అనిపిస్తుంది. ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.