Akkineni Akhil : అక్కినేని అఖిల్(Akkineni Akhil) త్వరలోనే జైనాబ్(Zainab Ravji) అనే అమ్మాయిని పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని అక్కినేని సన్నిహిత వర్గాలు అధికారికంగా ప్రకటించాయి కూడా. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కచ్చితంగా ఈ ఏడాది లోనే పెళ్లి చేసుకుంటారని తెలుసు కానీ, ఏ తేదీన అనే దానిపై సమాచారం లేదు. కానీ అఖిల్, జైనబ్ లు కలిసి ఈమధ్య బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. రీసెంట్ గానే అఖిల్ జైనబ్ తో కలిసి విమానాశ్రయం లో కెమెరాలకు చిక్కారు. పెళ్ళికి ముందే టూర్స్ వేస్తూ చక్కర్లు కొడుతున్న ఈ జంటకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అఖిల్ తన కాబోయే భార్య జైనబ్ ని గట్టిగా కౌగిలించుకుంటూ ఒక ఫోటో దిగి స్టోరీ లో అప్లోడ్ చేశాడు.
Also Read : ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ కి మోక్షం..ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
ఆ ఫోటో ‘నా సర్వస్వం’ అనే క్యాప్షన్ ప్రత్యేకంగా ఆకర్షించింది. చూస్తుంటే ఈ జంట ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకొని పెళ్ళికి ముందే ఒకరిని వదిలి ఒకరం ఉండలేము అనేంత స్థాయిలో రిలేషన్ ని ఏర్పాటు చేసుకున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలాంటి జంటలు పెళ్లి తర్వాత ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కలిసి వాటిని అధిగమించి పరిపూర్ణమైన దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తారని, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటోళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అఖిల్ ‘లెనిన్'(Lenin Movie) అనే రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్ ని ఆయన పుట్టినరోజు నాడు విడుదల చేశారు మేకర్స్. అఖిల్ ఇందులో గుబురు గెడ్డంతో ఊర మాస్ లుక్ లో కనిపించాడు. శ్రీలీల(Heroine Sree Leela) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే అఖిల్ కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం అత్యవసరం. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ ని కూడా అందుకోలేకపోయాడు. అవతల నాగ చైతన్య ఏమో మంచి నీళ్లు తాగినంత తేలికగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతుంటే, అఖిల్ ఇంకా బోణీ కొట్టకపోవడం పై అభిమానుల్లో చాలా తీవ్రమైన నిరాశ ఉంది. హిట్ కొట్టడం కాదు, ‘ఏజెంట్’ చిత్రంతో కుంభస్థలం బద్దలు కొట్టి, ఏకంగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడుతాడని అప్పట్లో అక్కినేని అభిమానులు చాలా గర్వంగా చెప్పుకునేవారు. కానీ విడుదల తర్వాత ఆ చిత్రం ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కనీసం ‘లెనిన్’ తో అయినా కం బ్యాక్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
Also Read : సంగీత దర్శకుడు తమన్ ని ఎగిరి కాళ్ళతో కొట్టిన అక్కినేని అఖిల్..బమ!