‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కి రిలీజ్ విషయంలో క్లారిటీ మిస్ అవుతుంది. మరోసారి మళ్ళీ వాయిదా వైపు వెళ్ళాడు. మొదట అక్టోబర్ 8న రిలీజ్ అంటూ అఖిల్ టీమ్ హడావుడి చేసింది. కానీ తాజాగా మరోసారి రిలీజ్ డేట్ ను వాయిదా వేశమంటూ ఒక పోస్టర్ వదిలి… పనిలో పనిగా అదే పోస్టర్ లో కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న మా సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ సగర్వంగా ప్రకటించుకున్నారు. అంటే… అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మళ్ళీ పోస్ట్ ఫోన్ అవ్వడం అక్కినేని అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
అయితే, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో రొమాంటిక్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయట. సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. అన్నట్టు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ స్ట్రైట్ రిలీజ్ డేట్ కోసం చాలా ప్రయత్నాలు చేసింది.
In theatres from 15th October. See you soon everyone 🤗#AlluAravind @hegdepooja @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/8HJMQoRjkk
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 26, 2021
కాకపోతే ఈ సినిమాకి స్ట్రైట్ రిలీజ్ డేట్ దొరికలేదు. అక్టోబర్ సెకండ్ వీక్ లో ఏకంగా నాలుగు సినిమాల వరకూ రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. మరి ఆ సినిమాల పోటీలో బ్యాచలర్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాడో చూడాలి. మరోపక్క బ్యాచలర్ అవుట్ ఫుట్ పై నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
మరి ఆ వార్తల్లో కొంత నిజం ఉన్నా ‘బ్యాచిలర్’ హిట్ కొట్టడం దాదాపు కష్టమే అవుతుంది. మరి చూడాలి బ్యాచిలర్ ఎంతవరకు నిలబడతాడో. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.