Akkineni Akhil : స్టార్ కిడ్స్ లైఫ్ స్టైల్ బోల్డ్ గా ఉంటుంది. బాలీవుడ్ లో అయితే దారుణం. స్టార్ హీరోలు, హీరోయిన్స్ పిల్లలు రిలేషన్స్, నైట్ పార్టీస్ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. దీనికి లింగ బేధం కూడా లేదు. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ కిడ్స్ కూడా తక్కువేమీ కాదు. కాకపోతే కొంచెం జాగ్రత్త పడతారు. బాలీవుడ్ స్టార్ కిడ్స్ మాదిరి విచ్చలవిడిగా ఎంజాయ్ చేయరు. కాగా అఖిల్ అక్కినేని చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాడు. ఆయన ఏడేళ్ల క్రితమే బాలీవుడ్ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నాడని తెలుస్తుంది.
హీరోయిన్స్ శ్రద్దా కపూర్, ఊర్వశి రాతెలాతో ఉన్న అఖిల్ త్రోబ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఊర్వశి రాతెలా ఈ పిక్ బయట పెట్టింది. ‘నేను నమ్మలేకపోతున్నా. ఏడేళ్ల క్రితం మేమందరం ఒక చోట’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఓ ప్రైవేట్ పార్టీలో వీరు కలిశారని అర్థం అవుతుంది. అఖిల్, ఊర్వశి, శ్రద్ధా కపూర్ కలిసి ఫోటోకి ఫోజిచ్చారు. ఈ కలిసిన సందర్భం ఏమిటనేది ఆమె చెప్పలేదు. కాగా అఖిల్ కి జంటగా ఊర్వశి ఓ ఐటెం నంబర్ చేశారు. ఏజెంట్ మూవీలో ‘వైల్డ్ సాలా’ పాటలో వీరిద్దరూ స్టెప్స్ వేశారు.
ఏజెంట్ చిత్రానికి ఉర్వశితో చేసిన వైల్డ్ సాలా సాంగ్ హైలెట్ అయ్యే సూచనలు కలవు. ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏజెంట్ లో అఖిల్ స్పై రోల్ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ, విడుదల ఆలస్యం అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి థియేటర్స్ లోకి వస్తుంది.
ఈ చిత్ర విజయం మీద అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన రేంజ్ మార్చేసే చిత్రం ఇది. విజయం సాధిస్తే అఖిల్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరవచ్చు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. హీరోగా వరుస ప్లాప్స్ ఎదుర్కొన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఏజెంట్ తో దాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. మరి అఖిల్ ప్లాన్స్ ఏ మేరకు ఫలితం ఇస్తాయో చూడాలి.