Akkineni Akhil: ఏజెంట్ మూవీకి టోటల్ నెగిటివ్ టాక్. మూవీలో అసలు కంటెంట్ లేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. అక్కినేని అభిమానులే ఏజెంట్ చిత్రాన్ని చూడలేకపోతున్నారు. అంత దారుణంగా మూవీ ఉందని సమాచారం. ఇదిలా ఉంటే అఖిల్ ని టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు తొక్కేస్తున్నాడని నిర్మాత నట్టి కుమార్ సీరియస్ ఆరోపణలు చేశారు. ఏజెంట్ చిత్రానికి థియేటర్స్ లేకుండా బ్లాక్ చేశారని, తెలుగు చిత్రం కంటే తమిళ చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించారని నట్టి కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు.
నాగార్జున ఫ్యామిలీ చాలా సౌమ్యులు. వారు ఎవరి జోలికి వెళ్లరు. అలాంటి వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారని నట్టి కుమార్ అన్నారు. పరిశ్రమను శాసిస్తున్న ఓ నిర్మాత ఏజెంట్ మూవీకి థియేటర్స్ దొరక్కుండా చేశారని అన్నారు. మణిరత్నం గారి గురించి నేను అనడం లేదు. పొన్నియిన్ సెల్వన్ 2 ఎంత పెద్ద సినిమా అయినా తెలుగు సినిమా తర్వాతే. మన సినిమాకు థియేటర్స్ కేటాయించాక తమిళ చిత్రాలు ఇవ్వాలి. అలా కాకుండా పొన్నియిన్ సెల్వమ్ 2కి అధిక థియేటర్స్ కేటాయించారు.
ఇంకా చెప్పాలంటే ఏజెంట్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ దొరక్కుండా చేశారు. మరి ఇంత జరుగుతుంటే నాగార్జున తెలియడం లేదా అని సందేహం కలుగుతుంది. నాగార్జున లాంటి వాళ్ళ చిత్రాలకే ఈ పరిస్థితి వచ్చే మా లాంటి చిన్న నిర్మాతల సంగతి ఏంటని నట్టి కుమార్ అన్నారు. దీంతో నత్తి కుమార్ ఎవరిని ఉద్దేశించి అన్నారనే అనుమానాలు మొదలయ్యాయి. నిజంగా అఖిల్ ని పరిశ్రమలో ఎదగకుండా తొక్కేస్తున్నారా? నట్టి కుమార్ కి ఈ కుట్రల గురించి తెలుసా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇక హీరోగా అఖిల్ ఐదు చిత్రాలు చేశారు. డెబ్యూ మూవీ ‘అఖిల్’ డిజాస్టర్. దర్శకుడు వివి వినాయక్ భారీ బడ్జెట్ తో అఖిల్ తెరకెక్కించారు. దారుణమైన ఫలితం అందుకుంది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేశారు. ఫలితం మాత్రం శూన్యం. నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రం ఆడింది. హీరోగా మొదటి హిట్ ఖాతాలో పడింది. సక్సెస్ ట్రాక్ ఎక్కారనుకుంటే ఏజెంట్ మూవీతో మళ్లీ వెనక్కి తగ్గారు. నాగార్జున అఖిల్ కెరీర్ విషయంలో అయోమయంలో పడుతున్నారు.