Akiranandan in OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న వాళ్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ ను సంపాదించుకున్న ఏకై నటుడు కూడా తనే కావడం విశేషం…ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమాలను సైతం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో ఓజీ (OG) సినిమాని వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తన దైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అని చూపించే కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి… ఆ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరానందన్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : మొదటి సినిమాకే పాన్ ఇండియన్ డైరెక్టర్..2 ఏళ్లలో అకిరా నందన్ గ్రాండ్ టాలీవుడ్ ఎంట్రీ!
అతని చేత కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ ని చాలా రహస్యం గా ఉంచుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ (Pavan Klayan) సారధ్యం లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తను సోలో హీరోగా మరొక సినిమాని చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ వారసుడి ఎంట్రీ ఈ సినిమాతో గ్రాండ్ గా ఉండబోతుందని మరి కొంతమంది మాత్రం ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తే కానీ ఇందులో అకిరా నందన్ నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదంటూ కష్టంతో మరికొందరు చెబుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమాలో అకిరా ఉన్నాడా లేదా అనేది క్లారిటీగా తెలియదు…