https://oktelugu.com/

OG Movie Shooting :  ఓజీ’ మూవీ షూటింగ్ లో పాల్గొన్న అకిరా నందన్..వైరల్ అవుతున్న వీడియో..అవేమి ఫైట్స్ సామీ!

టాక్ తో సంబంధం లేకుండా, కేవలం ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోగలదు. అయితే ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడని , పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఉన్నప్పటి క్యారక్టర్ ని ఆయన చేయబోతున్నాడని, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 25, 2024 / 09:10 PM IST

    OG Movie Shooting

    Follow us on

    OG Movie Shooting :   పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ హైప్ తో విడుదలైన చిత్రాలు జానీ,బంగారం,జల్సా, కొమరం పులి, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి. వీటిల్లో జానీ మూవీ కి ఉన్నంత క్రేజ్, హైప్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఏ చిత్రానికి కూడా ఉండేది కాదట. బాహుబలి సిరీస్ క్రేజ్ కూడా జానీ తర్వాతే అని చెప్పొచ్చు. కానీ మితిమీరిన అంచనాల కారణంగా ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫలితం సంగతి పక్కన పెడితే ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి అదే రేంజ్ క్రేజ్, హైప్ ఏర్పాటు చేసిన చిత్రం ‘ఓజీ’. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ప్రారంభ స్థాయి నుండే భారీగా ఏర్పడ్డాయి. ఇక ఎప్పుడైతే ఈ చిత్రం నుండి గ్లిమ్స్ వీడియో విడుదలైందో అప్పటి నుండి ఈ చిత్రంపై అంచనాలు ఎవ్వరి ఊహలకు అందని రేంజ్ కి చేరుకుంది.

    ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈ సినిమా కోసం పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో వైరల్ అయిపోతుంది. ఇంతటి క్రేజ్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకి కూడా ఏర్పడలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాక్ తో సంబంధం లేకుండా, కేవలం ఓపెనింగ్స్ తోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోగలదు. అయితే ఈ సినిమా ద్వారానే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నాడని , పవన్ కళ్యాణ్ టీనేజ్ లో ఉన్నప్పటి క్యారక్టర్ ని ఆయన చేయబోతున్నాడని, సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది నిజమో కాదో అనే అయ్యోమయ్యం లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో తిరుగుతున్న ఒక వీడియో గూస్ బంప్స్ ని రప్పిస్తుంది. ఈమధ్యనే హైదరాబాద్ లో ఓజీ మూవీ షూటింగ్ మొదలైంది.

    పవన్ కళ్యాణ్ లేకుండా, ఇతర తారాగణం మీద , ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆద్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుజిత్. అందుకు సంబంధించిన లొకేషన్స్ ఫోటోలను కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అయితే ఈరోజు సోషల్ మీడియా లో తిరుగుతున్న వీడియో ఓజీ షూటింగ్ కి సంబంధించినదే అని, ఆ వీడియోలో ఎరుపు రంగు చొక్కా వేసుకొని ఫైట్ చేస్తున్నది అకిరా నందన్ అని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, కొద్దీ రోజుల క్రితం మూవీ టీం సోషల్ మీడియా లో పెట్టిన లొకేషన్ ఫోటోకి , ఈ వీడియో లో ఉన్న లొకేషన్ రెండూ ఒక్కటే. కాబట్టి నిజం అవ్వొచ్చు కాకపోవచ్చు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఓజీ మూవీ టీం స్పందిస్తుందో లేదో చూడాలి.