Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన చేసిన సినిమాలు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కూడా కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే తన కొడుకు అయినా అకిరా నందన్ సింపుల్ గా ఉంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన కాశీలో చాలా సింపుల్ గా హంగులు ఆర్భాటాలు లేకుండా తిరుగుతున్నాడు. సెలబ్రిటీ కొడుకులు అంటే వీఐపీ, వీవీఐపీ పాసులతో ఏదైనా దైవ దర్శనానికి వెళుతూ ఉంటారు. కానీ అకిరా నందన్ మాత్రం సింప్లీసిటీతో ఎలాంటి పాసులు లేకుండా సామాన్య జనాల్లో కలిసి దైవదర్శనాలు చేసుకుంటూ ఉంటాడు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు అలాంటి వీడియోలను చూశాం… మరి ప్రస్తుతం ఆయన కాశీలో తిరుగుతూ పూర్తిగా దేవుడి సన్నిధి లో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగానే రేణు దేశాయ్ సైతం తన కొడుకు ఆటో ల్లో తిరుగుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం అకిరా నందన్ రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నాడు. కాబట్టి వాళ్లంతా కలిసి వెళుతూ లైఫ్ ని సింపుల్ గా లీడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఇది చూసిన నెటిజన్లు సైతం తండ్రి పవన్ కళ్యాణ్ సింప్లిసిటీతో ముందుకు సాగుతుంటే కొడుకు తండ్రిని మించిన తనయుడిగా ఉన్నాడు కదా! సింప్లిసిటీ అంటే ఇలానే ఉండాలి. స్టార్ స్టేటస్ లను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడే వాళ్లే నిజమైన స్టార్లు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా అకిరా నందన్ ప్రస్తుతం తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. కాబట్టి సినిమాలు చేసినా కూడా అడప దడపా చేస్తాడనే ఉద్దేశ్యంలోనే ఉన్నాడు. మరి అఖిరా నందన్ మాత్రం తనదైన రీతిలో సినిమాలు చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…