Akira Nandan And Aadhya: ఈమధ్య కాలం లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పెద్ద కొడుకు అకిరా నందన్(Akira Nandan) మీడియా కి బాగా కనపడుతున్నాడు. ఇతని మాటలు ఎలా ఉంటాయో అభిమానులు ఇప్పటి వరకు వినలేదు కానీ, అతని లుక్స్ ని చూసి పవన్ అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఏమున్నాడు రా బాబు, ఇతను ఎప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా దున్నేస్తాడు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. అయితే అకిరా నందన్ గతంలో తన తండ్రికి సంబందించిన పాత సినిమాలు రిలీజ్ అయ్యినప్పుడు థియేటర్ కి వెళ్లి , అభిమానులతో కూర్చొని చూడడం మనం చాలా సార్లు చూసాము. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి కూడా. రీసెంట్ గా ఆయన తన తండ్రి ఓజీ చిత్రాన్ని చెల్లి ఆద్య తో కలిసి హైదరాబాద్ బాలానగర్ లోని విమల్ థియేటర్ లో చూసాడు.
ఈ సినిమా ఇంటర్వెల్ సమయం లో తన చెల్లి ఆద్య తో కొట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇది సీరియస్ గా కొట్లాడుకోవడం కాదు, ఫన్నీ గానే కొట్లాడుకున్నారు. ఆద్య ఎల్లప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉండడం మనం గతంలో చాలాసార్లు చూసాము కానీ, అకిరా నందన్ మాత్రం చాలా సైలెంట్ గా ఉండడమే ఇన్ని రోజులు మనం చూసాము. కానీ అకిరా లో ఇంత చిలిపితనం ఉందా?, చిరాకు పడినప్పుడు అతని ఫిషియల్ ఎక్స్ ప్రెషన్స్ ఇలా ఉంటాయా? అనేది ఈ వీడియో ని చూసిన తర్వాతే తెలిసింది. ఈ మాత్రం ఉంటే చాలు, వెండితెర ని దున్నేయొచ్చు అంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతటా ఒక రేంజ్ లో వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఇక ఓజీ చిత్రం విషయానికి వస్తే ఈ సినిమా ఈ వీకెండ్ తో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోబోతుంది. ఇప్పటికే 270 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వీకెండ్ తో 300 కోట్ల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వచ్చే వారం కూడా మంచి థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉండడం తో, లెక్క ఇంకా పెరగొచ్చని, 350 కోట్ల మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది.
Aadhya & Akira ❤️ pic.twitter.com/jIwMYpqU2G
— OG (@whencutt_2) October 3, 2025