Varan Tej And Lavanya Son: హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) జంటకు గత నెల 10వ తేదీన మగబిడ్డ పుట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ లో చాలా కాలం తర్వాత పుట్టిన మగబిడ్డ కావడం తో ఆ కుటుంబం లో సంబరాలు ఆకాశాన్ని అంటాయి. ఈ చిన్నారికి దసరా సందర్భంగా బారసాల కార్యక్రమం నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన కొడుకు పేరు ని రివీల్ చేసాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పుట్టిన మా బాబుకు వాయువ్ తేజ్ కొణిదెల అనే పేరు ని పెట్టాము. మీ అందరి దీవెనలు మా బిడ్డపై ఉండాలి’ అంటూ వరుణ్ తేజ్ ఒక ట్వీట్ వేసాడు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫోటోనే కనిపిస్తుంది.
మెగా ఫ్యామిలీ సంగతి కాసేపు పక్కన పెడితే, నాగబాబు కుటుంబానికి మాత్రం అమృత గడియలు నడుస్తున్నాయని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి కోడలిగా నాగబాబు ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుండి అన్ని శుభాలే జరుగుతున్నాయి. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కెరీర్ పరంగా నిర్మాతగా మొట్టమొదటి సక్సెస్ అయ్యింది. అదే విధంగా నాగబాబు ఎమ్మెల్సీ గా ఎంపికై శాసన మండలి లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే ఆయన మంత్రిగా క్యాబినెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇక రీసెంట్ గానే మగబిడ్డ జన్మించాడు. ఇలా కుటుంబం లో వరుసగా శుభాలే జరుగుతుండడం విశేషం. ఇక వరుణ్ తేజ్ కెరీర్ పరంగా విజయాలను చూస్తే సంపూర్ణం అయ్యినట్టే అనుకోవచ్చు. కెరీర్ ప్రారంభం భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ వచ్చిన వరుణ్ తేజ్, ఈమధ్య కాలంలో వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్నాడు.
ఆయన గత రెండు చిత్రాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియని పరిస్థితి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘మట్కా’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆయన ఆశలన్నీ మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా మీదనే ఉంది. ఇండియా, కొరియా దేశాలకు సంబంధించిన స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తో వరుణ్ తేజ్ భారీ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.