Akira Nandan: పవన్ కళ్యాణ్ ఒక ఒక్క పక్క ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంతిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టేస్తుంది. నిన్నటి నుండి ‘హరి హర వీరమల్లు’ కొత్త షెడ్యూల్ మొదలవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న బిజీ కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడింది. ఇలా ఈ మూడు సినిమాలు పూర్తి చేసేందుకే ఇంత సమయం పడుతుంది, ఇక భవిష్యత్తులో ఆయన సినిమాలు చేయడం దాదాపుగా అసాధ్యమే. అందుకే ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అకిరా తల్లి రేణు దేశాయ్ ‘అకిరా నందన్ ని నటన అంటే ఆసక్తి లేదు. అతనికి మ్యూజిక్ మీదనే అమితాసక్తి ఉంది’ అని చెప్పుకుంటూ వచ్చేది. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, అకిరా నందన్ యాక్టింగ్ స్కూల్ లో నిన్ననే జాయిన్ అయ్యాడు.
తనకి యాక్టింగ్ ని నేర్పించిన గురువు సత్యానంద్ స్కూల్ లోనే అకిరా నందన్ ని చేర్చిపించినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయినా అకిరా కొన్ని నెలల పాటు అక్కడే యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకోనున్నాడు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. అంటే రాబోయే రెండు మూడు ఏళ్లలో అకిరా నందన్ సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఆయన మొదటి సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసుకుంటున్నాడు. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. కచ్చితంగా పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ చేతిలోనే అకిరా నందన్ మొదటి సినిమా పెడతారని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్.
పవన్ కళ్యాణ్ కి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగే సత్తా ఉన్నప్పటికీ, ఆ ట్రెండ్ మొదలయ్యే లోపే ఆయన రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమానే మొట్టమొదటి పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ చిత్రం. ఆ తర్వాత ‘ఓజీ’ కూడా రెండవ పాన్ ఇండియన్ చిత్రం గా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని తెస్తాయో లేదో తెలియదు కానీ, అకీరానందన్ పని చేయబోయేది మొత్తం పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ తోనే కాబట్టి, అతనికి మొదటి రెండు మూడు సినిమాలతోనే పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్స్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఎప్పటికీ మర్చిపోలేని డెబ్యూట్స్ గా మహేష్ బాబు, రామ్ చరణ్ మొదటి సినిమాలు నిలిచాయి. అకిరా నందన్ డెబ్యూట్స్ వాళ్ళని మరిపించేలా ఉంటుందా లేదా అనేది చూడాలి.