Akhira Nandan in Ram Charan Buchi babu movie
Ram Charan: ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని చెప్పుకునే రేంజ్ లో మన సినిమా ఇండస్ట్రీ ఎదగడం అనేది నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ సినిమాలు మాత్రమే చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బుచ్చిబాబు సన డైరెక్షన్ లో చేయబోయే సినిమా మీద తన ఫోకస్ మొత్తాన్ని పెట్టబోతున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకిరా నందన్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయనకి యాక్టింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వస్తున్నప్పటికీ రామ్ చరణ్ అడగడంతో కాదనలేక తను ఈ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది..ఈ సినిమా స్పోర్ట్స్ బ్యా డ్రాప్ తెరకెక్కుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఒక కీలక పాత్రలో 15 నిమిషాల పాటు అఖీరా నందన్ కనిపించబోతున్నాడట.
ఇక తొందర్లోనే పవన్ కళ్యాణ్ కొడుకుగా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న అఖిరా నందన్ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య అయిన “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్” సినిమాలో ఒక కీలకమైన పాత్రతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు.
ఇక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బుచ్చిబాబు సనా ఈ సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు ఆయన ఈ స్టోరీ మీద మూడు సంవత్సరాల పాటు వర్క్ చేస్తున్నాడు…కాబట్టి ఈ సినిమాను పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ చేసి చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…