https://oktelugu.com/

బిగ్ బాస్-4.. ఈవారం ఎలిమినేటర్ పై క్రేజీ ఉత్కంఠ.. ఎందుకు?

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లకు భిన్నంగా నాలుగో సీజన్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టులు బయటికి వెళ్లారు. ప్రస్తుతం షో ఏడోవారానికి చేరుకోవడంతో  గేమ్ రసకందాయంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీవారు ఎక్కువ రోజులు ఉండేందుకు పోటీపడుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టుల మధ్య చిచ్చుపెట్టే టాస్కులు పెడుతూ షోపై మరింత అంచనాలను పెంచేస్తున్నాడు. దీంతో […]

Written By: , Updated On : October 19, 2020 / 03:21 PM IST
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఎంతగానో అలరిస్తోంది. బిగ్ బాస్-1.. బిగ్ బాస్-2.. బిగ్ బాస్-3లకు భిన్నంగా నాలుగో సీజన్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టులు బయటికి వెళ్లారు. ప్రస్తుతం షో ఏడోవారానికి చేరుకోవడంతో  గేమ్ రసకందాయంగా మారుతోంది.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరికీవారు ఎక్కువ రోజులు ఉండేందుకు పోటీపడుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టుల మధ్య చిచ్చుపెట్టే టాస్కులు పెడుతూ షోపై మరింత అంచనాలను పెంచేస్తున్నాడు. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. కిందటి వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఏడోవారంలో నామినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా మారింది. ఈవారం నామినేషన్ అయినవారిలో అభిజిత్.. నోయల్.. దివీ వాద్యా.. అవినాష్.. మోనాల్ గజ్జర్.. అరియానా ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తూ అలరించినవారే నామినేషన్లో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనే ఉత్కంఠ మొదలైంది. అయితే ఈవారం నామినేషన్ నుంచి దెత్తడి హారిక.. అఖిల్.. సోహైల్, మెహబూబ్.. లాస్య.. అమ్మరాజశేఖర్ తప్పించుకున్నారు.

ఏడోవారం ఎలిమినేషన్ పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియకు ఎంపికైన వారంతా బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్న వారే కావడంతో బిగ్ బాస్ చివరి నిమిషం ఎలిమినేషన్ వాయిదా వేయచ్చనే టాక్ విన్పిస్తోంది. అయితే దీనికి బదులుగా తదుపరి వారం డబుల్ ఎలిమినేషన్ చేసే గేమ్ పై మరింత ఉత్కంఠను రేపనుంది.

బిగ్ బాస్ ప్రతీవారం ఏదో ఒక ట్వీస్టు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దీంతో ఏడోవారంలో బిగ్ బాస్ ఇచ్చే ట్వీస్ట్ ఇదేనా? అనే చర్చ ప్రేక్షకుల్లో జోరుగా నడుస్తోంది. అందరూ ఊహించినట్లు బిగ్ బాస్ ఎలిమినేషన్ ను వాయిదా వేస్తాడా? లేక కొత్త ట్వీస్ట్ తో గేమ్ ను మరింత క్రేజీగా మరుస్తాడా? అనేది వేచిచూడాల్సిందే..!