Akhil Wife Age Gap : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్(Akkineni AKhil) కి సంబంధించిన పెళ్లి ఫొటోలే కనిపిస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన జైనబ్(Zainab Ravdji) మేడలో మూడు ముళ్ళు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కు అత్యంత సన్నిహితంగా ఉండే 300 మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ సందర్భంగా అఖిల్ సతీమణి జైనబ్ రవ్జీ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అభిమానులు వీటిని తెలుసుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. జైనబ్ రవ్జీ ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. ఎన్నో ఏళ్ళ నుండి జుల్ఫీ తో నాగార్జున కి అత్యంత సాన్నిహిత్యం ఉన్నది. అంతే కాకుండా జుల్ఫీ అనే వ్యక్తి మాజీ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు కూడా.
Also Read : థగ్ లైఫ్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..’ఇండియన్ 2′ ని మించిన డిజాస్టర్!
నాగార్జున కూడా జగన్ కి అత్యంత సన్నిహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే సంచలనం రేపుతున్న విషయం ఏమిటంటే అఖిల్ కి జైనబ్ కి మధ్య వయస్సు తేడా అక్షరాలా 9 ఏళ్ళు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్త. నాగార్జున కేవలం తన ఆస్తులను పెంచుకోవడం కోసమే జైనబ్ తో తన చిన్న కుమారుడి వివాహం చేయించాడని కొందరు అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, అఖిల్- జైనబ్ లు చాలా కాలం నుండి ప్రేమించుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అనేది మాత్రం నిజమని చెప్తున్నారు అభిమానులు. ఎన్నో ఏళ్ళ నుండి ఆమె తండ్రి తన కుటుంబం తో సన్నిహితం గా ఉంటూ వస్తున్నాడు కాబట్టి, ఆ కుటుంబం లో ఒకరితో అఖిల్ కి మంచి రిలేషన్ ఏర్పడడం లో వింతేమీ ఉంది?, ప్రేమకు వయస్సు తో అవసరం లేదు,కేవలం మనసులు కలిస్తే చాలు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అఖిల్ కెరీర్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి సినిమా నుండి అఖిల్ కి రీ రీ రీ లాంచులే కానీ, ఒక్క హిట్ కూడా దక్కడం లేదు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలు యావరేజ్ గా ఆడినప్పటికీ అవి అఖిల్ కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుంది, ఈ సినిమాతో అఖిల్ నేరుగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెడతాడు అంటూ అప్పట్లో అక్కినేని అభిమానులు సవాల్ చేశారు. కానీ ఆ సినిమా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి డిజాస్టర్ తగలకుండా, ఆచి తూచి అడుగులు వేస్తూ ‘లెనిన్’ అనే చిత్రాన్ని ఎంచుకున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అఖిల్ కి మొట్టమొదటి భారీ హిట్ గా నిలుస్తుందో లేదో చూద్దాం.