Akkineni Akhil Wedding : అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్(Akkineni Akhil) పెళ్లి నేడు ఉదయం మూడు గంటలకు అంగరంగ వైభవం గా జరిగింది. జైనబ్(Zainab) అనే అమ్మాయి తో గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న అఖిల్,నేడు అతిరథ మహారథుల సమక్షం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. వాస్తవానికి అక్కినేని నాగార్జున ప్రముఖ రాజకీయ నాయకులను, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాడు కానీ, తెల్లవారు జామున పెళ్లి కావడంతో వాళ్ళు హాజరు కాలేకపోయినట్టుగా తెలుస్తుంది. అయితే నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు అఖిల్ కి సోదర సమానుడైన రామ్ చరణ్ కూడా ఈ పెళ్ళికి హాజరు అయ్యాడు. వీళ్ళతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్,ఉపాసన, సుమంత్ మరియు ఇతర అక్కినేని కుటుంబ సభ్యులు ఈ వివాహ మహోత్సవం లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
పెళ్ళికి అందరూ అతిథులు రాకపోయి ఉండొచ్చేమో కానీ, రిసెప్షన్ కి మాత్రం అందరూ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లోనే రిసెప్షన్ ని జరిపించబోతున్నారు. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కానీ, అదే విధంగా అక్కినేని అఖిల్ సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కానీ ఎలాంటి అప్లోడ్స్ జరగలేదు. అభిమానులు వాళ్ళ నుండి రాబోయే ఫోటోల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ వివాహం అక్కినేని కుటుంబం లో కొత్త వెలుగులను నింపుతుందని అభిమానులు భావిస్తున్నారు. గతంలో అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీళ్ళు గతం లో ప్రేమించుకున్నారు. కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ వీళ్ళ నిశ్చితార్థం పెళ్లి వరకు తీసుకొని వెళ్ళలేదు, మధ్యలోనే రద్దు అయ్యింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది.
Also Read : ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ కి మోక్షం..ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తాడు కానీ అఖిల్ కి అదృష్టం కలిసి రావడం లేదని అభిమానుల అభిప్రాయం. కానీ ఇతనికి టాలీవుడ్ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగేంత సత్తా ఉందని అభిమానులతో పాటు అందరూ చాలా బలంగా నమ్ముతారు. ఒకే ఒక్క భారీ హిట్ తగిలితే చాలు అఖిల్ ని అందుకునేవాళ్ళు ఉండరు అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఆ భారీ హిట్ ఎప్పుడు వస్తుంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన లెనిన్ అనే రూరల్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా మీద అఖిల్ కి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటించింది.