Sudigali Sudheer blockbuster entertaining show : జబర్దస్త్ వేదికగా స్టార్ అయిన సుడిగాలి సుధీర్ అనంతరం బుల్లితెరపై సంచలనాలు చేశాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్ సుడిగాలి సుధీర్ సొంతం. దానికి తోడు సుడిగాలి సుధీర్ ప్రొఫెషనల్ మెజీషియన్. మంచి డాన్సర్, సింగర్ కూడాను. ఇలా మల్టీ టాలెంట్స్ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర చిత్రాల్లో సుధీర్ హీరోగా నటించాడు. గాలోడు మూవీ సక్సెస్ కావడంతో హీరోగా బిజీ కావడం ఖాయమని అందరూ భావించారు.
కారణం తెలియదు కానీ సుడిగాలి సుధీర్ కి ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు. ఆయన హీరోగా మొదలెట్టిన చిత్రాలు కూడా ఆగిపోయాయనే వాదన ఉంది. కొన్నాళ్ళు యాంకరింగ్ ని పక్కన పెట్టిన సుధీర్ తిరిగి మరలా యాంకర్ గా బిజీ అయ్యాడు. ఫ్యామిలీ స్టార్ లో యాంకర్ గా సుధీర్ సందడి చేస్తున్నాడు. తాజాగా మరో షోతో సుడిగాలి సుధీర్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. ఆహా లో సక్సెస్ఫుల్ షోగా ఉన్న సర్కార్ లేటెస్ట్ సీజన్ తిరిగి ప్రారంభం కానుంది. సర్కార్ సీజన్ 5 ప్రోమో వచ్చేసింది.
Also Read : హాస్పిటల్ పాలైన సుడిగాలి సుధీర్..ముదురుతున్న అనారోగ్య సమస్యలు.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే!
సర్కార్ షోకి యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా ఉండేవాడు. ఆయన హీరోగా ఓ మూవీ చేసేందుకు కొన్నాళ్ళు యాంకరింగ్ కి విరామం ప్రకటించాడు. దాంతో షోకి యాంకరింగ్ చేసే ఛాన్స్ సుధీర్ కి దక్కింది. సర్కార్ సీజన్ 4ని విజయవంతంగా నడిపించాడు సుధీర్. దాంతో సీజన్ 5ని హోస్ట్ చేసే బాధ్యత కూడా ఆహా ఆయనకే అప్పగించింది. ఇక ఫస్ట్ ఎపిసోడ్ జూన్ 6న సాయంత్రం 7 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది.
దీనికి సంబంధిన ప్రోమో ఆహా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. నలుగురు యంగ్ బ్యూటీస్ ఫస్ట్ ఎపిసోడ్ లో కంటెస్ట్ చేశారు. ఇక ఒక్కొక్కరిని ఆహ్వానించిన సుధీర్, వారితో పులిహోర కలిపాడు. సదరు యువతులతో సుధీర్ సంభాషణ నవ్వులు పూయించాయి. సుధీర్ ఫ్యాన్స్ సర్కార్ సీజన్ 5 ప్రోమో వైరల్ చేస్తున్నారు. మరో వైపు సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది. సుధీర్ ప్రేయసిగా చెప్పుకునే యాంకర్ రష్మీ సైతం వివాహం చేసుకోవడం లేదు.