Homeఎంటర్టైన్మెంట్Akhil - Samantha : అఖిల్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్? సమంత హాజరవుతుందా?

Akhil – Samantha : అఖిల్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్? సమంత హాజరవుతుందా?

Akhil – Samantha : కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కి గత ఏడాది నవంబర్ 26న ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్టీజీ కుమార్తె జైనబ్ తో అఖిల్ ఏడడుగులు వేయనున్నారు. జైనబ్ తో అఖిల్ ది ఆరెంజ్డ్ మ్యారేజ్ నా లేక లవ్ మ్యారేజా? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. జైనబ్ తో అఖిల్ కి కూడా పరిచయం ఉందట. నిశితార్థం జరిగిన దాదాపు ఆరు నెలలు అవుతుండగా, పెళ్ళికి సిద్ధం అవుతున్నారని సమాచారం అందుతుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 6న వివాహం అట. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఈ పెళ్ళికి సమంత హాజరవుతుందా?. మాజీ భర్త నాగ చైతన్య మీద చాలా కోపంగా ఉంది సమంత. విడాకులు అనంతరం ఆమె పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూల్లో తన అసహనాన్ని బయటపెట్టింది. అయితే అఖిల్ కి ఆమె చాలా క్లోజ్. ఒకరికి మరొకరు బర్త్ డే విషెష్ చెప్పుకుంటారు. అఖిల్ నటించిన సినిమాల విడుదలకు ముందు ఆల్ ది బెస్ట్ చెబుతుంది సమంత. ఇటీవల సైతం అఖిల్, సమంత కలిశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమంతకు అఖిల్ ఇంత క్లోజ్ కాగా, ఆయన పెళ్ళికి ఆమె హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే వేడుకలో నాగ చైతన్య, శోభిత, నాగార్జున తో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు ఉంటారు. వారిని సమంత చూడటం, పలకరించడం ఇబ్బందికర పరిణామం. ఏం జరుగుతుందో ఇక చూడాలి.

Also Read : సమంతపై రాజ్ నిడిమోరు భార్య సంచలన వ్యాఖ్యలు..పోస్ట్ వైరల్.. ఆమె ఎవరో తెలుసా?

గతంలో అఖిల్.. శ్రేయా భూపాల్ అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కారణం తెలియదు కానీ, ఆ వివాహం ఆగిపోయింది. ఇక అఖిల్ కెరీర్ పరిశీలిస్తే.. పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా సాలిడ్ హిట్ పడలేదు. పూజ హెగ్డేకు జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. గత చిత్రం ఏజెంట్ నిరాశపరిచింది. కొంచెం గ్యాప్ తీసుకున్న అఖిల్ లెనిన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

లెనిన్ లో అఖిల్ ఫస్ట్ టైం రా అండ్ రస్టిక్ రోల్ చేస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుంది. అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. మురళి కృష్ణ అప్పూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, నాగ వంశీ నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular