Naga Chaitanya – Samantha : నాగ చైతన్య-సమంత విడాకులు అప్పట్లో ఓ సంచలనం. టాలీవుడ్ లవ్లీ కపుల్ గా పేరుగాంచిన ఈ జంట నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడిపోయారు. అందుకు పలు కారణాలు వినిపించాయి. ముఖ్యంగా సమంత ఆరోపణలు ఎదుర్కొంది. నిరాధార కథనాలు ప్రసారం చేసిన మీడియా ఛానల్స్ మీద ఆమె చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సమంతతో విడిపోయిన నాగ చైతన్య ఇటీవల శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఆమెతో రహస్యంగా డేటింగ్ చేసిన నాగ చైతన్య, గత ఏడాది నిశితార్థం చేసుకున్నాడు. అనంతరం వివాహమాడారు.
మరోవైపు సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. నటిగా నిర్మాతగా ఆమె రాణిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సమంత, శుభం టైటిల్ తో తన మొదటి చిత్రం నిర్మించింది. ఇటీవల థియేటర్స్ లోకి వచ్చిన శుభం మంచి ఫలితాన్ని అందుకుంది. ఓటీటీ, థియేట్రికల్ హక్కుల ద్వారా సమంత లాభాలు ఆర్జించినట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాతగా కూడా సమంత సక్సెస్ అయ్యారనే వాదన వినిపిస్తుంది. సమంత ప్రేమలో ఉన్నారనే పుకార్లు సైతం తెరపైకి వచ్చాయి.
Also Read : నాగ చైతన్య టాటూ ని తొలగించడానికి సమంత అంత పని చేసిందా..?
ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ దర్శకుడు రాజ్ తో సమంత రిలేషన్ నడుపుతున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2, హనీ బన్నీ సిరీస్లలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ ఎఫైర్ రూమర్స్ మీద సమంత స్పందించకపోవడం విశేషం. కాగా గతంలో నాగ చైతన్య తన మొదటి ముద్దు అనుభవం పంచుకున్నాడు. అప్పటికి సమంత-నాగ చైతన్య విడిపోలేదు.
రానా హోస్ట్ గా ఉన్న షోలో పాల్గొన్న నాగ చైతన్య.. 9వ తరగతిలోనే ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ అయ్యింది అన్నాడు. జీవితాంతం అది మర్చిపోలేను అని వెల్లడించాడు. అదే షోలో సమంతను ఉద్దేశించి నాగ చైతన్య మాట్లాడాడు. సమంత కంటే తాను తెల్లగా ఉంటానని ఓ అభిమాని చెప్పిందని, ఆ మాటలు ఆనందాన్ని ఇచ్చాయని నాగ చైతన్య అన్నారు. కాగా సమంత-నాగ చైతన్య జంటగా నటించిన ఏమాయ చేసావే మూవీలో లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. సిల్వర్ స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ అద్భుతం చేసింది.