Akhil : ‘అఖిల్’తో  బాలీవుడ్ యంగ్ బ్యూటీ రొమాన్స్..  వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్  !

Akhil- Ananya Panday: సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందుకే.. అఖిల్ ఈ సినిమా అవుట్ ఫుట్ చెక్ చేసి తనకు తగిన విధంగా సినిమాని మార్చుకోవడానకి వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే, వచ్చే వారం నుంచి మనాలిలో ఈ రెండు సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. ఇక ఈ రెండు సాంగ్స్ […]

Written By: Shiva, Updated On : September 24, 2022 11:33 pm
Follow us on

Akhil- Ananya Panday: సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఇక ఈ సినిమాకి సంబంధించి రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందుకే.. అఖిల్ ఈ సినిమా అవుట్ ఫుట్ చెక్ చేసి తనకు తగిన విధంగా సినిమాని మార్చుకోవడానకి వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే, వచ్చే వారం నుంచి మనాలిలో ఈ రెండు సాంగ్స్ ను షూట్ చేయనున్నారు.

Akhil

ఇక ఈ రెండు సాంగ్స్ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో అనన్య పాండే నటించబోతుందని తెలుస్తోంది. అనన్య పాండే ప్రస్తుతం లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలాంటి సమయంలో కూడా అమ్మడు ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. పైగా ఈ సాంగ్ లో అఖిల్ తో అనన్య పాండే రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందట. ఈ సాంగ్.. ఈ సినిమాలోనే వెరీ స్పెషల్ గా నిలుస్తోందట. ఇక అక్కినేని అఖిల్ ఈ సినిమాలో తన లుక్ ను రివీల్ చేస్తూ రీసెంట్ గా ఒక ఫోటో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Surekha Vani: అవి బాగా ఉన్న బాయ్ ఫ్రెండ్ కావాలి.. లేటు వయసులో సురేఖా వాణి ఘాటు కోరిక !

ఈ ఫోటో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో అఖిల్ డిఫరెంట్ గెటప్ లో వైల్డ్ గా కనిపిస్తున్నాడు. దాంతో, అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ లైక్ అండ్ షేర్ చేస్తూ బాగా వైరల్ చేశారు. స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు.

Ananya Panday

కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు సురేందర్ రెడ్డితో ఈ సినిమా చేస్తున్నాడు. పైగా ఈ ‘ఏజెంట్’ సినిమా కోసం అఖిల్ భారీ కసరత్తులు చేస్తూ సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు. తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు. కండలు తిరిగిన దేహంతో ఒళ్ళు విరుచుకుంటూ అఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

నిజానికి అఖిల్ చాలా కాలంగా జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాడు. తన కష్టాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపిస్తాడట. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు. మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి.

Also Read:Liger First Review: లైగర్’ ఫస్ట్ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

 

 

Tags