VV Vinayak- Akhil: టాలీవుడ్ లో మాస్ హీరోలతో సమానమైన ఇమేజీ ఉన్న దర్శకుడు వీవీ వినాయక్..ఒకప్పుడు ఈయనతో సినిమాలు తియ్యడానికి టాప్ స్టార్ హీరోలు క్యూ కట్టేవారు..రాజమౌళి తర్వాత ఇండస్ట్రీ లో అంతతి డిమాండ్ ఉన్న డైరెక్టర్ ఆయన..హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా కేవలం వినాయక్ పేరు ని చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న వీవీ వినాయక్ తో ఇప్పుడు సినిమాలు తియ్యడానికి ఏ టాప్ హీరో కూడా ముందుకు రావడం లేదు.

కారణం రీసెంట్ గా ఆయనకీ వచ్చిన డిజాస్టర్ ఫ్లాప్స్..ప్రస్తుతం ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీ లో ‘ఛత్రపతి’ మూవీ ని రీమేక్ చేస్తున్నాడు..ఇది ఇలా ఉండగా రీసెంట్ గా వీ వీ వినాయక్ ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ ని ఇండస్ట్రీ కి గ్రాండ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ వినాయక్ గారే..అప్పట్లో ఈ సినిమా పై విడుదలకు ముందు మాములు అంచనాలు ఉండేవి కాదు..ఎందుకంటే ఈ సినిమాకి ముందు విడుదలైన మనం సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చూసి టాలీవుడ్ కి మరో మహేష్ బాబు లాంటి హీరో దొరికాడు అనే హైప్ భారీ గా ఉండేది..దానికి తోడు మొదటి సినిమా వీవీ వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ అవ్వడం తో కచ్చితంగా కొడితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వాలి అనే రేంజ్ హైప్ తోనే విడుదలయ్యింది.

ఓపెనింగ్స్ అదిరిపోయాయి కానీ ఫుల్ రన్ లో కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది..ఈ సినిమా ఫలితం పట్ల వినాయక్ మానసికంగా మరియు ఆర్థికంగా చాలా కృంగిపోయాడట..ఆయన మాట్లాడుతూ ‘నాగార్జున గారు నన్ను ఎంతగానో నమ్మి అఖిల్ గ్రాండ్ ఎంట్రీ బాధ్యతలు నాకు అప్పగించారు..కానీ నేను ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను..అఖిల్ ఈ సినిమాని ఎంతో ప్రేమతో చేసాడు..కానీ ఆశించిన ఫలితం రాకపోవడం తో అతను చాలా బాధ పడ్డాడు..ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ సినిమాని భారీ రేట్స్ తో అప్పట్లో ఎగబడి కొని దారుణంగా నష్టపోయారు..నా సినిమా వల్ల ఎవ్వరు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యం తో ఒక పెద్దమనిషిని మధ్యలో కూర్చోపెట్టి నష్టపోయినవారందరికి నష్టపరిహారం అందించాను..ఆ తర్వాత నేను చాలా ఆర్ధిక సంక్షోభం లో పడ్డాను..ఈ సినిమా తర్వాతే నాకు కూడా బాడ్ డేస్ ప్రారంభమయ్యాయి’ అంటూ చెప్పుకొచ్చాడు వినాయక్.