Jana Sena- National Media Survey: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ అమాంతం పెరిగిపోతుంది..వైసీపీ నిరంకుశ పాలనని ఎండగడుతూ నువ్వా నేనా అనే రేంజ్ లో జగన్ ప్రభుత్వం కి ఎదురెళ్తున్న పవన్ కళ్యాణ్ ని జనాలు ప్రధాన ప్రతిపక్షనేత గా చూడడం చిన్నగా మొదలు పెడుతున్నారు..2019 ఎన్నికలలో పవన్ ‘జీరో బడ్జెట్’ పాలిటిక్స్ అంటే ఎవ్వరు నమ్మలేదు..అవతల టీడీపీ మరియు వైసీపీ పార్టీలు పోటీపడీమరీ డబ్బులు పంచుతూ ఓట్లను కొంటుంటే.

జనసేన పార్టీ మాత్రం సామాన్యులకు ఎమ్యెల్యే సీట్లు ఇచ్చి సరికొత్త ప్రయోగం చేసి చేతులు కాల్చుకుంది..పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు..175 స్థానాల్లో 1 సీటు ,23 లక్షల ఓట్లు , 7 శాతం వోట్ బ్యాంకు లభించింది..సాధారణంగా ఇలాంటి ఫలితం వస్తే ఏ రాజకీయ నాయకుడు కూడా పార్టీని నడపడు..కానీ పవన్ కళ్యాణ్ తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ నిలుపుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయి సంస్థాగత నిర్మాణం చేసాడు.
ప్రజాసమస్యలపై పోరాడుతూ లైంలైట్ లోకి వచ్చి రోజురోజుకి తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్నాడు..ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క క్రియాశీలక రాజకీయాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం విజయవంతంగా కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు..ఇది ఇలా ఉండగా ఇటీవలే టీడీపీ , వైసీపీ పార్టీలు ప్రస్తుతం మనం ఏ స్థానం లో ఉన్నాము..జనసేన పార్టీ ఎదుగుదల ఎలా ఉంది..మనకి ఆ పార్టీ వల్ల ఏమైనా నష్టం కలగనుంది అనే కోణం లో ఎవరికివారు వ్యక్తిగత సర్వేలు చేయించుకున్నారు.

ఈ సర్వేలలో జనసేన పార్టీ గడిచిన మూడు సంవత్సరాలలో చాలా అభివృద్ధి చెందింది అని తెలిసింది..2019 ఎన్నికల సమయానికి కేవలం 7 శాతం వోట్ బ్యాంకు ఉన్న జనసేన పార్టీ కి ప్రస్తుతం 13 శాతం వోట్ బ్యాంకు ఉన్న పార్టీ గా ఎదిగిందని.
పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తే ఈ వోట్ బ్యాంకు 13 శాతం నుండి 20 శాతం కి పెరిగే అవకాశం ఉందని..ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ పేరు మీద వచ్చే వోట్ బ్యాంకు అని..జనసేన పార్టీ లో బలమైన నేతలు చేరడం ప్రారంభిస్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ వైపు తిరుగుతాయని,ప్రధాన ప్రతిపక్ష పార్టీ గా ఎదుగుతుందని ఈ సర్వే లో తేలిందట..ఈ విషయం ప్రస్తుతం ఇరు పార్టీలను కలవరపెడుతున్న అంశం అని తెలుస్తుంది..అయితే జనసేన పార్టీ ఎదుగుదల టీడీపీ కి ప్రధాన ముప్పు కాబట్టి పవన్ కళ్యాణ్ తో జతకట్టేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నాడు.