అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ అనుకున్నంత విజయం సాధించాలేకపోయింది. అఖిల్ చాల రోజుల గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మద్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ లుక్ ని ప్రొడక్షన్ టీం రిలీజ్ […]
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ (జోష్ దర్శకుడు) కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ మూవీ అనుకున్నంత విజయం సాధించాలేకపోయింది. అఖిల్ చాల రోజుల గ్యాప్ తరువాత ఈ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మద్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ లుక్ ని ప్రొడక్షన్ టీం రిలీజ్ చేసారు, పోస్టర్‌లో ఫారిన్ వీధుల్లో కాళ్లకి చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నాడు అఖిల్. ఈ సినిమా ని వేసవిలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పుడు అఖిల్ కొత్త ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో హిట్ అయిన ‘బదాయి హో’ రీమేక్ లో నటించాలని అనుకుంటున్నారట. ఈ సినిమా హక్కులని సితార ఎంటర్టైన్మెంట్స్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.