ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్… ఇందులో ఫోటోలు, వీడియో క్లిప్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఒకటిగా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రావడంతో, సెలబ్రిటీలు తమ ఫోటోలను వ్యక్తిగతంగా లేదా ప్రొఫెషనల్‌గా షేర్ చెయ్యడం ప్రారంభించారు. ఐతే టాలీవుడ్ హీరోలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా అభిమానులను అలరించడమే కాకుండా ఆకట్టుకునే ఫాలోయింగ్ ను పాదించుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో టాప్ ఫాలోయింగ్ కలిగి ఉన్న తెలుగు హీరోలు వీరే..!
1.విజయ్ దేవరకొండ – 5.9M ఫాలోవర్స్
విజయ్ దేవేరకొండ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పెద్ద పేరు తెచ్చుకున్నాడు,సెన్సషనల్ స్టార్ గా పిలవబడే విజయ్ దేవేరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచాడు. 30 ఏళ్ల ఈ నటుడికి 5.9 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.
2.అల్లు అర్జున్ – 5.3M ఫాలోవర్స్
స్టైలిష్ స్టార్ గా పిలవబడే అల్లు అర్జున్ తరుచు ఇన్‌స్టాగ్రామ్ లో తన సినిమా, కుటుంబానికి సంబందించిన ఫొటోస్ వీడియోస్ ని షేర్ చేస్తూ హుషారు గా ఉంటాడు, 37 ఏళ్ల ఈ నటుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 5.3 మిలియన్ల భారీ ఫాలోయింగ్ ఉంది.
3.మహేష్ బాబు – 4.2M ఫాలోవర్స్
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న ప్రముఖుల జాబితా ఎ-లిస్ట్ నటులలో మహేష్ బాబు ఒకరు. ఈ స్టార్ హీరో తన కొత్త ప్రాజెక్టుల గురించి మరియు తన కుటుంబంతో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు, ఈ సూపర్ స్టార్ కి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల ఫాలోయింగ్ ఉంది.
4.ప్రభాస్ – 4.1M ఫాలోవర్స్
ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ మాత్రమే కాదు, అంతర్జాతీయ ఐకాన్ కూడా. 2019 ఏప్రిల్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన ఈ రెబల్ స్టార్ ప్రభాస్ కి 4.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.