Akhil and Samantha : అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సమంత(Samantha Ruth Prabhu) విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా అప్పట్లో ఎలాంటి సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ వీళ్ళ గురించి ఎదో ఒక వార్త సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉంటుంది. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. మరోపక్క సమంతా కూడా రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వీళ్లకు సంబంధించిన కథనాలు సోషల్ మీడియా లో అసలు ఆగడం లేదు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పటికీ కూడా నాగ చైతన్య సోదరుడు అక్కినేని అఖిల్(Akkineni Akhil) తో మంచి సాన్నిహిత్యం మైంటైన్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడాకుల తర్వాత అఖిల్ కి రెండు మూడు సార్లు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.
Also Read : సమంతపై రాజ్ నిడిమోరు భార్య సంచలన వ్యాఖ్యలు..పోస్ట్ వైరల్.. ఆమె ఎవరో తెలుసా?
ఇక అక్కినేని అఖిల్ కూడా సమంత అనారోగ్యానికి గురైనప్పుడు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో త్వరగా కోలుకోవాలని కామెంట్స్ లో ప్రార్థన చేసాడు. ఇవన్నీ చూసిన నెటిజెన్స్ వీళ్ళ మధ్య ఇంకా మంచి బాండింగ్ కొనసాగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా లో తిరుగుతున్న ఒక ఫోటో సంచలనంగా మారింది. ఇది లేటెస్ట్ ఫోటోనా?, లేకపోతే పాత ఫోటోనా అనేది అభిమానులకు అర్థం కావడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో అయితే అటు అఖిల్ అకౌంట్ లో కానీ, ఇటు సమంత అకౌంట్ లో కానీ ఈ ఫోటో లేదు. కానీ సమంత, అఖిల్ లుక్స్ చూస్తుంటే రీసెంట్ ఫొటోలాగానే అనిపిస్తుంది. అయితే ఈ ఫోటో ని చూసిన అభిమానులు వీళ్ళ మధ్య ఇంకా మంచి సాన్నిహిత్యం ఉన్నట్లుగా ఉన్నది, త్వరలోనే జరగబోతున్న అఖిల్, జైనబ్ పెళ్లి కి సమంత కూడా ముఖ్య అతిథిగా హాజరు అవుతుందేమో అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే చాలా కాలం గ్యాప్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి హీరోయిన్ గా కాదు, నిర్మాతగా రీ ఎంట్రీ ఇచ్చింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే సంస్థ ని స్థాపించి ఆమె నిర్మించిన మొదటి చిత్రం ‘శుభమ్’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. థియేటర్స్ లో దిగ్విజయంగా నడుస్తున్న ఈ సినిమా బయ్యర్స్ కి అన్ని ప్రాంతాల్లో లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఇక నుండి సమంత ప్రధాన పాత్రలు పోషించే సినిమాలన్నిటికీ ఆమెనే నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఈ చిత్రానికి ఆమెనే నిర్మాత. అదే విధంగా ‘రక్త బ్రహ్మాండ’ అనే భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read : అనారోగ్యం కారణంగానే విడాకులు..? సంచలనం రేపుతున్న సమంత రెస్పాన్స్!