Salman Khan : ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సల్మాన్ ఖాన్(Salman Khan). గత దశాబ్దం లో బాలీవుడ్ ని కనుసైగతో శాసించిన హీరో ఆయన. ఓపెనింగ్స్ పెట్టాలన్నా ఆయనే, ఫుల్ రన్ రికార్డ్స్ కొట్టాలన్నా ఆయనే. ఆయనకు దరిదాపుల్లో మరో సూపర్ స్టార్ బాలీవుడ్ లో ఉండేవాడు కాదు. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న సల్మాన్ ఖాన్ ఇటీవల కాలం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సికిందర్’ చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇలా వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ గడ్డు కాలాన్ని చూస్తున్న సల్మాన్ ఖాన్ కి, రీసెంట్ గా జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ వ్యవహారం మరో పెద్ద తలనొప్పి గా మారింది. ఇండియన్ ఆడియన్స్ కారణంగా ఇంత స్టార్ స్టేటస్ ని సంపాదించి, వాళ్లకు కష్టమొచ్చినప్పుడు కనీసం సంగీభావం కూడా తెలపలేదని సల్మాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.
పెహల్గామ్(Pahalgam) లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన ఇండియన్ ప్రభుత్వ ఆద్వర్యం లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్స్ పై దేశం మొత్తం గర్వించింది. దీనిపై మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఎంత సంతోషాన్ని వ్యక్తం చేసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ సల్మాన్ ఖాన్ నుండి ఈ అంశం పై ఒక్క ట్వీట్ కూడా పడలేదు. కానీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందో, అప్పుడు ఆయన ‘సీజ్ ఫైర్ ని ఆపినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ వేసాడు. అంతే ఇక నెటిజెన్స్ సల్మాన్ ఖాన్ ని ఏకిపారేశారు. పాకిస్తాన్ పై అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ కి వెళ్ళిపో, మా దేశం గాలి పీల్చే అర్హత కూడా నీకు లేదంటూ ఆయన్ని సొంత అభిమానులే తిట్టసాగారు.
Also Read : రామ్ చరణ్ ‘జంజీర్’ డైరెక్టర్ తో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా..పాపం ఫ్యాన్స్ పరిస్థితి!
ఇలాంటి హీట్ వాతావరణం లో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇండియన్ ఆర్మీ నేపథ్యం లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త రావడం పెద్ద కలకలం రేపింది. రీసెంట్ గా జరిగిన ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా ఒక స్క్రిప్ట్ ని డెవలప్ చేసాడని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని బాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అపూర్వ లఖియా గతంలో రామ్ చరణ్ తో ‘జంజీర్’ అనే చిత్రం చేసాడు. దీని ఫలితం ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే సల్మాన్ ఖాన్ ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చేసేవి అన్నీ చేస్తూ ఇప్పుడు ఇండియన్ ఆర్మీ మీద ఎదో ప్రేమ పొంగుకొని వచ్చినట్టు ఇలాంటి సినిమాలు చేయడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.