Gopichand Vs Director Teja: దర్శకుడు తేజ చాలా మంది యువ నటులకు లైఫ్ ఇచ్చారు. కొత్తవాళ్లతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన చరిత్ర ఆయనది. చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో ఆయన పరిశ్రమను షేక్ చేశారు. తేజ వలన వెలుగులోకి వచ్చిన నటుల్లో గోపీచంద్ ఒకరు. దివంగత దర్శకుడు టి. కృష్ణ కుమారుడైన గోపీచంద్ 2001లో పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలివలపు ఆయన ఫస్ట్ మూవీ. హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. స్నేహ హీరోయిన్ గా నటించింది. తొలివలపు ఆడలేదు. దీంతో ఆయనకు హీరోగా ఆఫర్స్ రాలేదు. దర్శకుడు తేజ గోపీచంద్ కి విలన్ రోల్ ఆఫర్ చేశాడు.
జయం మూవీలో గోపీచంద్ మెయిన్ విలన్ గా చేశాడు. ఆ పాత్ర గోపీచంద్ కి మంచి పేరు తెచ్చింది. ఆ వెంటనే నిజం మూవీలో మరోసారి విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు తేజ. వర్షం మూవీలో ప్రభాస్ కి విలన్ గా చేశాడు. నటుడిగా ఈ మూడు చిత్రాలు పేరు తెచ్చాయి. అప్పుడు మరలా హీరోగా యజ్ఞం చేశాడు. ఆ చిత్రం హిట్ కావడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. కాబట్టి గోపీచంద్ కి లైఫ్ ఇచ్చింది తేజనే. అలాంటి దర్శకుడికి గోపీచంద్ హ్యాండ్ ఇచ్చాడట. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో గోపీచంద్ మీద తేజ ఫైర్ అయ్యాడు.
గోపీచంద్ కొత్త చిత్రం రామబాణం ప్రమోషన్స్ లో భాగంగా తేజ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా నువ్వు నా ఫోన్ కూడా ఎత్తలేదని తేజ అసహనం వ్యక్తం చేశాడు. ‘నీకు ఒక కథ చెప్పాను. ఓకే చేద్దాం అన్నావ్. హీరోయిన్ సెట్ కాలేదు. హీరోయిన్ ని సెట్ చేసే లోపు నువ్వు సడన్ గా ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశావు. నువ్వు నా ఫోన్ కూడా ఎత్తలేదు. నా కంటే మంచి డైరెక్టర్ దొరికాడనుకున్నావ్… నన్ను పక్కన పెట్టేశావ్’ అని అన్నాడు. అవును ఫోన్ ఎత్తకపోవడం నా తప్పే అని గోపీచంద్ ఒప్పుకున్నాడు.
జయం మూవీలో నాకు ఛాన్స్ కేవలం మీ నాన్న మంచితనం వలెనే వచ్చింది. మరలా నీకు అలాంటి ఫౌండేషన్ పడలేదని నా నమ్మకం అని తేజ అన్నాడు. మీ నాన్న గొప్పోడే నువ్వేం పీకావ్ అని నేరుగా అడిగాడు. హీరో గోపీచంద్ ని తేజ అల్లాడించేశాడంటే నిజం. గోపీచంద్ తిరిగి ఒక్క ప్రశ్న మాత్రమే అడిగారు. మీరెందుకు సినిమా సినిమాకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారని గోపీచంద్ డైరెక్టర్ తేజను అడిగారు. నేను అవకాశం ఇవ్వమని ఎవరి దగ్గరకు వెళ్ళను. అందుకే ఆలస్యం అవుతాయని తేజ అన్నారు. ఈ సంచలన ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ అవుతుంది. నేడు పూర్తి ఇంటర్వ్యూ అందుబాటులోకి రానుంది.
Honest Talks & Frankful confessions 🤞
Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru 🤩
FULL INTERVIEW TOMORROW 💥#RamaBanam #RamabanamOnMay5 🏹
@peoplemediafcy @shreyasgroup pic.twitter.com/wAoD9Iuo54
— Shreyas Media (@shreyasgroup) April 25, 2023