Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni-Zainab wedding reception : వైభవంగా అఖిల్ అక్కినేని-జైనబ్ రిసెప్షన్... హాజరైన స్టార్స్, వైరల్...

Akhil Akkineni-Zainab wedding reception : వైభవంగా అఖిల్ అక్కినేని-జైనబ్ రిసెప్షన్… హాజరైన స్టార్స్, వైరల్ ఫోటోలు

Akhil Akkineni-Zainab wedding reception : అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన రెండో కుమారుడు అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడు అయ్యాడు. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన జైనబ్ రవడ్జీ తో అఖిల్ అక్కినేని ఏడడుగులు వేశాడు. చాలా ఏళ్లుగా అక్కినేని-రవడ్జీ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో జైనబ్ తో అఖిల్ కి పరిచయం కొనసాగుతుంది. అది ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసిందని సమాచారం. జూన్ 6న నాగార్జున నివాసంలో అఖిల్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో వేదికగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ సందడి చేశారు. మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్ సతీసమేతంగా హాజరయ్యారు. కన్నడ స్టార్ హీరో యష్ సైతం హాజరయ్యారు. కోలీవుడ్ స్టార్ సూర్య దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్-జైనబ్ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం హాజరయ్యారు.

నాని, అల్లరి నరేష్, నిఖిల్, సుధీర్ బాబుతో పాటు పలువురు ఈ వేడుకలో సందడి చేశారు. స్టార్స్ రాకతో అఖిల్-జైనబ్ రిసెప్షన్ కలర్ఫుల్ గా మారింది. అఖిల్ మ్యారేజ్ రిసెప్షన్ ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.

ప్రస్తుతం అఖిల్ లెనిన్ టైటిల్ తో విలేజ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అఖిల్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. రాయలసీమ నేపథ్యంలో లెనిన్ తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version