https://oktelugu.com/

Akhil: స్టార్ డైరెక్టర్ ను పట్టిన అఖిల్…ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడా..?

Akhil: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో పని చేసినప్పటికీ ఆయనకి సక్సెస్ మాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలు సైతం వరుసగా ఒకటి, రెండు సక్సెస్ లు కొడుతూ ఉంటే అఖిల్ విషయంలో మాత్రం ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 19, 2024 / 03:49 PM IST
    Follow us on

    Akhil: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు ఐదారు సినిమాలు చేసినప్పటికీ ఒక్క సినిమాతో కూడా తన సత్తాను చాటుకోలేకపోతున్నాడు. నిజానికి అఖిల్ నాగార్జున కొడుకు కావడం వల్ల అక్కినేని ఫ్యామిలీ వారసుడు కావడంతో ఇన్ని రోజులు పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు కానీ ఆయన ప్లేస్ లో వేరే హీరో ఉంటే ఎప్పుడో తట్టాబుట్టా సర్దుకోవాల్సి వచ్చేది అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన ఇప్పటివరకు ఒక హిట్టు కూడా అందుకోకపోవడం నిజంగా ఆయన బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లతో పని చేసినప్పటికీ ఆయనకి సక్సెస్ మాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలు సైతం వరుసగా ఒకటి, రెండు సక్సెస్ లు కొడుతూ ఉంటే అఖిల్ విషయంలో మాత్రం ఒక్క సక్సెస్ కూడా రావడం లేదు. ఇక దాంతో నాగార్జున ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ని అఖిల్ తో సినిమా చేయడానికి రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే తెలుగులో ఇప్పటి వరకు స్టార్ హీరోలు అందరితో డైరెక్షన్ చేసిన కొరటాల శివ తో తన నెక్స్ట్ సినిమాని అఖిల్ తో చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ప్రస్తుతం కొరటాల ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అయితే మొదటి పార్ట్ చేసిన తర్వాత బయట ఒక సినిమా చేసి మళ్లీ రెండో పార్టు మొదలు పెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో దేవర సినిమా మొదటి పార్ట్ పూర్తి అయిన వెంటనే కొరటాల అఖిల్ తో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత మళ్లీ రెండో పార్టు తెరకెక్కిస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున వల్లే కొరటాల శివ అఖిల్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో అయిన అఖిల్ సక్సెస్ బాట పడతాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది…