Homeఎంటర్టైన్మెంట్Lenin Movie Song: 'లెనిన్' నుండి 'ఎట్టా ఎట్టా' సాంగ్ వచ్చేసింది.. అక్కినేని అఖిల్ నుండి...

Lenin Movie Song: ‘లెనిన్’ నుండి ‘ఎట్టా ఎట్టా’ సాంగ్ వచ్చేసింది.. అక్కినేని అఖిల్ నుండి ఇలాంటి డ్యాన్స్ ఊహించలేదు..

Lenin Movie Song: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా , ఇప్పటికీ కెరీర్ లో సరైన సక్సెస్ ని అందుకోని హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది అక్కినేని అఖిల్(Akkineni Akhil) మాత్రమే. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది , డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు , యాక్టింగ్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఉంటుంది, అయినప్పటికీ ఈ కుర్ర హీరోకి సరైన సక్సెస్ లేకపోవడం గమనార్హం. ‘ఏజెంట్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నారు కానీ, అది ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత సూపర్ హిట్ కొట్టిన తర్వాతే అభిమానులకు నా ముఖం చూపిస్తాను అని సవాలు చేసి , ‘లెనిన్'(Lenin Movie) అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక నేడు ఈ చిత్రం నుండి ‘ఎట్టా ఎట్టా’ అనే మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. భాస్కర్ భట్ల లిరిక్స్ రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందిమ్చాగా , శ్రీకృష్ణ గాత్రం అందించారు. ఈ పాటలో ఎప్పటి లాగానే తమన్ మార్క్ కనిపించింది. అంతే కాకుండా పాటలో భాస్కర్ భట్ల లిరిక్స్ కూడా చాలా చక్కగా కుదిరింది. ఇక అక్కినేని అఖిల్ , హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. అంతా బాగానే ఉంది కానీ , అక్కినేని అఖిల్ నుండి కావాల్సినంత ఎనర్జీ మాత్రం ఈ పాటలో కనిపించలేదు. మాములుగా అఖిల్ డ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికి తెలిసిందే. టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ లో ఆయన ఒకడు. కానీ ఈ పాటలో ఎందుకో కాస్త లావుగా కనిపించాడు , శరీరాన్ని కడపలేకపోతున్నాడు. కానీ ఆయన లోకేష్ మాత్రం గత చిత్రాలతో పోలిస్తే చాలా బాగుందని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే , ముందుగా ఏప్రిల్ 30 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకున్నారు మేకర్స్. కానీ అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల అవ్వబోతుంది అనే విషయాన్నీ తెలుసుకొని ఈ చిత్రాన్ని జూన్ 25 కి వాయిదా వేశారు. ఇప్పుడు ‘పెద్ది’ కూడా జూన్ 24 కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ‘లెనిన్’ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే నేడు విడుదలైన పాటకు సంబంధించిన వీడియో లింక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

 

Yetta Yetta Video Song | Lenin | Akhil Akkineni | Bhagyashri Borse | Thaman S | Murali Kishor A

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version