Site icon OkTelugu

Royal Enfield Flying Flea C6: Royal Enfield Flying Flea C6 బైక్ ఎందుకు కొనాలి.. హంటర్ 350 కంటే ఎందులో బెటర్..

Royal Enfield Flying Flea C6

Royal Enfield Flying Flea C6

Royal Enfield Flying Flea C6: నగరాల్లో ఉండేవారు బైక్ పై రైడింగ్ చేస్తే ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం స్టైలిష్ గా ఉండే ప్రీమియం ఫీచర్లు కలిగిన వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారికి Royal Enfield కంపెనీ డిఫరెంట్ బైక్స్ ను తీసుకొస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి Hunter 350 అనే మార్కెట్లోకి వచ్చి విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే దీనికి మించి ఇప్పుడు మరో బైక్ ఆకట్టుకొని ఉంది. ఇది కూడా ఈ కంపెనీ నుంచే వచ్చినప్పటికీ హంటర్ 350 కంటే మెరుగైన ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ బైక్ ఏది? హంటర్ 350 కంటే ఇది ఎందులోనూ మెరుగ్గా ఉంటుంది?

Royal Enfield నుంచి మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Flying Flea C6. క్లాసిక్ అవతారంలో వచ్చిన ఈ మోటార్ సైకిల్ నగరాల్లో ఉండే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనిని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇది హంటర్ 350 కి మించి ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

వీటిలో మొదటిది టార్క్ రిలీజ్ చేయడంలో ప్రత్యేకతను కలిగి ఉండడం. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సి సిక్స్ బైక్ తక్షణ టార్క్ డెలివరీ రిలీజ్ చేస్తుంది. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ లో నుంచి సులభంగా బయటపడడానికి ఇది బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా నగరాల్లో ఎక్కువగా స్టాప్ లు ఉంటాయి. ఇలా బైక్ ఆగినప్పుడు వెంటనే రీస్టార్ట్ కావడానికి ఈ టార్క్ అద్భుతంగా పనిచేస్తుంది.

నగరాల్లో రోడ్లు చాలా స్మూత్ గా ఉంటాయి. ఈ రోడ్లపై మరింత ఆందోళన లేకుండా ప్రయాణం చేయడానికి ఇందులో ఉండే ఇంజన్ స్మూత్ డ్రైవింగ్ ను అందిస్తుంది. ఇది హంటర్ 350 తో పోలిస్తే సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనం కావడంతో ఎలాంటి శబ్దం ఉండదు.

హంటర్ 350 కంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫ్లయింగ్ ఫ్లీ సి సిక్స్ బైక్ ఎకో ఫ్రెండ్లీ లాగా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం కావడంతో దీని నుంచి ఎటువంటి కర్బన ఉద్గారాలు బయటకు రాకుండా ఉండి వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా మిగతా వారికి దీని నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కొత్త బైక్ లో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్లు ఉంటాయి. మొబైల్ కనెక్టివిటీ, వైర్లెస్ చార్జింగ్, స్మార్ట్ రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, బైక్ డైరెక్షన్ క్రాల్ మోడ్, ఆటో ఓల్డ్, స్మార్ట్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉంటాయి.

వీటితోపాటు ఈ బైక్ తో ఎక్కువగా ప్రయాణ ఖర్చులు ఉండవు అని అంటున్నారు. అయితే మెయింటెనెన్స్ చార్జీలు పడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో ఉండే వారికి ఇది ఉపయోగపడుతుంది. వీరికి అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లో కూడా అందుబాటులో ఉంటే ఏ సమస్య ఉండదు.

Exit mobile version