
Pushpa – Akhanda: కరోనా తర్వాత థియేట్రికల్ బిజినెస్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ఏ సినిమాకి ఏ రేంజ్ మార్కెట్ ఉంటుందో చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. అయితే, గత మూడు వారాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ బాగానే ఊపు అందుకుంది. ప్రతి వారం వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలకు బాగానే ఓపెనింగ్స్ వస్తున్నాయి. పైగా సినిమా బాగుంటే.. సక్సెస్ ఫుల్ గా భారీ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
కాకపోతే, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ టికెట్స్ ఇష్యూ నడుస్తోంది. ఏపీలో ఉన్న టికెట్ రేట్లు కారణంగా పెద్ద చిత్రాలకు నష్టాలూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ మధ్య కొన్ని విజయవంతమైన చిత్రాలకు కూడా ఏపీలో నష్టాలు వచ్చాయి. కారణం.. టికెట్ ఇష్యూనే. అందుకే, ఇప్పుడు భారీ చిత్రాల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల పై ఒత్తిడి పెంచుతున్నారు.
డిసెంబర్ 2న బాలయ్య ‘అఖండ’ విడుదలవుతుంది. ఇక వరుణ్ తేజ్ గని డిసెంబర్ 3న విడుదలవుతుంది. అలాగే పుష్ప డిసెంబర్ 17న విడుదల కానుంది. అలాగే ఖిలాడీ, ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి సినిమాలు కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల డిస్ట్రిబ్యూటర్లు ఆయా నిర్మాతలతో గొడవకు దిగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఈ సినిమాలకు డీల్స్ కుదిరాయి.
డీల్స్ కుదుర్చుకున్న తర్వాత టికెట్ రేట్లు పెరగకపోవడం, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా లాభాలు రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. మేము ఇచ్చిన మొత్తంలో కనీసం 35 శాతం అయినా తమకు వెనక్కి ఇవ్వాలని, లేదంటే తమకు నష్టాలు తప్పవని వాళ్లంతా నిర్మాతల చుట్టూ తిరుగుతున్నారు. అయితే, నిర్మాతల వెర్షన్ మాత్రం మరోలా ఉంది.
సినిమా రిలీజ్ అయ్యాక, నిజంగానే నష్టాలు వస్తే.. అప్పుడు కచ్చితంగా ఆదుకుంటాం అని చెబుతున్నారట. కానీ, మా డబ్బు తీసుకుని మమ్మల్ని ఆదుకున్నేది ఏమిటి ? అంటూ డిస్ట్రిబ్యూటర్లు సీరియస్ అవుతున్నారు. మొత్తానికి డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అయిన పుష్ప, అఖండ లాంటి పెద్ద సినిమాల బిజినెస్ పరిస్థితి ప్రస్తుతం ఎవరికీ అర్ధం కావడం లేదు.
Also Read: బన్నీకి కుడి భుజం సరిగా పనిచేయదు !