Akhanda Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబోలో వస్తున్నఈ మూడవ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు గట్టిగా ఉన్నాయని చెప్పాలి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “సింహా”, “లెజెండ్” చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారు నందమూరి అభిమానులు. అలానే ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్ గా నటిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.

అయితే తాజాగా “అఖండ” డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసిందని సమాచారం. ఓటిటి స్టీమింగ్ హక్కులను భారీ ధరకు డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా… రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాకు మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు, పోస్టర్, పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో ఆహాలో సందడి చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌ను పూర్తి చేసుకున్న బాలయ్య… రెండో ఎపిసోడ్‌ను నేచురల్ స్టార్ నానితో కలిసి రానున్నారు.