Homeఎంటర్టైన్మెంట్Samantha: స్నేహితురాలి పుట్టినరోజు సమంత ఎమోషనల్​ పోస్ట్​!

Samantha: స్నేహితురాలి పుట్టినరోజు సమంత ఎమోషనల్​ పోస్ట్​!

Samantha: ప్రముఖ టాలీవుడ్​ హీరోయిన్​ సమంత- నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత.. ఎక్కువ సమయాన్ని స్నేహితులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల తన క్లోజ్​ ఫ్రెండ్​ శిల్పా రెడ్డితో కలిసి సామ్​ విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్​స్టా, ట్విట్టర్​ వేదికగా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్​ చేస్తూ కనిపించింది. తాజాగా, సమంత తన స్నేహితురాలు డాక్టర్​ మంజుల పుట్టినరోజు వేడుకకు హాజరైంది. ఈ పార్టీకి సామ్​తో పాటు​ తన స్నేహితురాలు, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. ​ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా అభిమానులతో సోషల్​ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

https://www.instagram.com/p/CWAEwt1hn1M/?utm_source=ig_web_copy_link

పోస్ట్​లో భాగంగా మంజులను ఉద్దేశిస్తూ.. నీ లాంటి ఓ స్నేహితురాలు నా జీవితంలో భాగమవడం నా అదృష్టంగా భావిస్తున్నా అంటూ పేర్కొంది. నీ కంటే నిజమైన స్నేహితులు ఎవ్వరూ లేరంటూ భావోద్వేగంతో తెలిపింది. నా ప్రేమ నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ.. బర్త్​డే విషెస్ తెలిపింది.

మరోవైపు ప్రస్తుతం విడిగా ఉంటున్న సమంత వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్​లోనూ అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. శాకుంతలం సినిమాతో పాటు, విజయ్​ సేతుపతితోనూ ఒక సినిమాకు ఒప్పందం కుదుర్చుకుంది. మరి తను భవిష్యత్తు కోసం కన్న కలలు ఎంత మేరకు నెరవేరతాయో చూడాలి మరి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular